ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి

Anilkumar
టాలీవుడ్ లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 'అలా మొదలైంది' అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఇక ఈ మధ్యకాలంలో సమంతతో ఓ బేబీ అనే సినిమా తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అయితే ఇప్పుడు కొంత గ్యాప్ తీసుకుని తాజాగా 'అన్నీ మంచి శకునములే' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ఈ మూవీలో హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ వేసవి కానుకగా మే 18న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకురాలు నందిని రెడ్డి ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. 

ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ముందు సినిమా గురించి మాట్లాడుతూ..' ఈ కథను నేను ఎప్పుడో రాసుకున్నాను. ముందు విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నా. తను కూడా ఇంట్రెస్ట్ చూపించాడు. తర్వాత విజయ్ దేవరకొండ ఇమేజ్ మారిపోయింది. ఇలాంటి సాఫ్ట్ రోల్ అతనికి కరెక్ట్ కాదని నేను, నిర్మాత స్వప్న దత్ ఫీలయ్యాం. అదే విషయాన్ని విజయ్ కి చెప్పాను. దాని తర్వాత నేను ఓ బేబీ మూవీ చేశాను. అది పూర్తయ్యాక కోవిడ్ వల్ల రెండేళ్లు వృథా అయ్యింది. ఇక ఈ ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు నటీనటుల కోసం వెతుకుతున్నప్పుడు సడన్గా సంతోష్ పేరు చెప్పింది. వెంటనే స్క్రీన్ టెస్ట్ చేశాను. ఈ రోజురోల్ కి సరిగ్గా సెట్ అయ్యాడు.

సంతోష్ మాత్రమే కాదు మూవీలో ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రకి కరెక్టుగా సూట్ అయ్యారు' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ..' బన్నీతో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. నేను రాసే ప్రతి కథను బన్నీకి షేర్ చేస్తుంటాను. ఎప్పటి నుంచో అతనితో సినిమా చేయాలని ఉంది. కానీ కుదరడం లేదు. ఇప్పుడు బన్నీ పెద్ద స్టార్ అయ్యారు. ఆయన ఇమేజ్కు తగ్గ మంచి కథ ఉంటే కచ్చితంగా సినిమా చేస్తా. సమంత కూడా నాకు మంచి స్నేహితురాలు. సమంతకు ఏదీ అంత ఈజీగా రాలేదు. ఆమె ఎంత కష్టపడుతుందో నాకు తెలుసు. హార్డ్ వర్క్ విషయంలో సమంత, బన్నీ ఒక్కటే. కష్టపడడం వల్లే వాళ్ళిద్దరూ ఈరోజు ఈ స్థాయికి రాగలిగారు. అంతేకానీ అదృష్టం వల్ల కాదు' అంటూ నందిని రెడ్డి తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: