నిఖిల్ నెక్స్ట్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..!?

Anilkumar
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటిగా చిన్న చిన్న పాత్రలో నటించి తన టాలెంట్ తో ఎన్నో సినిమాల్లో అద్భుతమైన అవకాశాలను దక్కించుకున్నాడు. మొదట్లో ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ ఎప్పుడూ కేవలం సంవత్సరానికి ఒక్కసారి మనం మాత్రమే చేస్తున్నాడు.  భిన్నమైన కథలను ఎంచుకుంటూ సూపర్ డూపర్ హిట్టులను అందుకుంటున్నాడు. కార్తికేయ సినిమా ఎంతటి క్రేజ్ ను అందుకుందో ప్రత్యేకంగా . ఇక ఆ సినిమా తర్వాత కార్తికేయ 2 సినిమాతో సంచలన విజయాన్ని ఇతని ఖాతాలో వేసుకున్నాడు. 

ఆ సినిమా తర్వాత 18 పేజీ సినిమాలో నటించి మరోసారి అందరినీ మెప్పించాడు. ఇక 2022లో మాత్రమే రెండు సినిమాలతో అలరించిన నిఖిల్ ఎప్పుదు.తాజాగా ఇప్పుడు  స్పై అనే యాక్షన్ త్రిల్లర్ సినిమాతో మరోసారి పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేశాడు. స్పై సినిమాతో ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. యూనిక్ పాయింట్తో తెలుగుతోపాటు తమిళ హిందీ మలయాళం కన్నడ భాషలో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. భారీ అంచనాల నడుమ ఈ సినిమాని జూన్ 29వ తేదీన విడుదల చేయబోతున్నారు.ఈ క్రమంలోనే ఈ కుర్ర హీరో తన నెక్స్ట్ సినిమాని లైన్లో పెట్టినట్లుగా తెలుస్తోంది.

మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాకి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మతో నిఖిల్ తన తదుపరి సినిమాని చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆయన కథకు నీకెందుకు సైతం ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెలలోనే లాంచ్ కాబోతుంది .ఇక ఈ సినిమా ఒక యాక్షన్ డ్రామా అని అంటున్నారు. అయితే ఇదివరకే వీరి కాంబినేషన్లో స్వామి రారా సినిమా వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నిఖిల్ సరసన మైఖేల్ ఫ్రేమ్ దివ్యాంశ కౌశిక్ నటించబోతుందని సమాచారం. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: