రష్మీక వెంటపడుతున్న బాలీవుడ్ స్టార్.. అందుకేనా..!?

Anilkumar
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన. అంతే కాకుండా సోషల్ మీడియాలో సైతం నేషనల్ క్రష్ అని ఒక బ్రాండ్ ని సైతం సొంతం చేసుకుంది .చాలామంది కుర్రకారులు రష్మిక అందానికి ఫిదా అయిపోతారు. సాధారణ సినీ ప్రేక్షకులతో పాటు ఇండియన్ క్రికెటర్స్ సైతం రష్మిక మందన ఫ్యాన్స్ గా ఉన్నారు. దీంతో రష్మిక ఏ రేంజ్ లో సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఉంటే ఇక పుష్ప సినిమాతో పని ఇండియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది. 

అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం అల్లు అర్జున్ తర్వాత అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న సెలబ్రిటీగా మారిపోయింది. ప్రస్తుతం ఈమె పుష్ప టు సినిమాతో పాటు నితిన్ వెంకి కుడుముల కాంబినేషన్లో రాబోయే మరో సినిమాలో కూడా నటిస్తోంది.దాంతోపాటు తెలుగు తమిళ భాషల్లో సైతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇదిలావుంటే ఇక మరోవైపు హిందీలో రష్మిక మందన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న ఒక పాన్ ఇండియా సినిమాలో రణబీర్ కపూర్ కి జోడిగా నటిస్తుంది. ఇక రష్మిక మందన బ్రాండ్ ఇమేజ్ పెరగడంతో ప్రముఖ కంపెనీలు సైతం ఆమెతో ఉత్పత్తులని ప్రమోట చేయించుకోవడంపై తెగ ఆసక్తి చూపుతున్నారు.

అంతేకాదు దానికోసం రెమ్యూనరేషన్ సైతం పెద్ద మొత్తంలో ఇస్తున్నారు. దాంతోపాటు బాలీవుడ్ స్టార్స్ సైతం రష్మిక మందన వైపు ఇప్పుడు ఫోకస్ పెడుతున్నారు. షాహిద్ కపూర్ అలాగే విక్కీ కౌశల్ తమ కొత్త సినిమాలో రష్మిక మందనని హీరోయిన్గా తీసుకోవాలని చూస్తున్నారట. అంతేకాకుండా బి టౌన్ లో ఇప్పుడు ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది .ఇదివరకు గుడ్ బై మిస్టర్ మజ్ను సినిమాలతో రష్మిక మందన బాలీవుడ్ లో కి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం యానిమల్ సినిమాతో బ్రేక్ కోసం ప్రయత్నిస్తోంది రష్మిక..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: