ఎన్టీఆర్ కి జోడిగా ప్రభాస్ హీరోయిన్.. ఇక ఫాన్స్ కి పండగే..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్30 సినిమా షూటింగ్లో ఉన్నాడు. ఆచార్య వంటి భారీ డిజాస్టర్ తర్వాత కొరటాల చాలా గ్యాప్ తీసుకొని ఈ సినిమాని తీస్తున్నాడు. ఏప్రిల్ తొలి వారంలోనే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ఇప్పుడు రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా చివరి దశకి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఆమెతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా సముద్రపు మాఫియా నేపథ్యంలో  వస్తున్న ఈ కథ 2024 ఏప్రిల్ 5 విడుదల కానుంది .

ఇక ఈ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా లో నటించబోతున్నాడు. దీనికంటే ముందే రితిక్ రోషన్ తో కలిసి వర్క్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ప్రారంభించ బోతున్నారు. అయితే తాజాగా ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాకి సంబంధించిన ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది .అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి జంటగా బాలీవుడ్ భామ శ్రద్ధ కపూర్ నటించబోతున్నట్లుగా పలు వార్తలు వినిపిస్తున్నాయి.

 గతంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే నటించబోతుందన్న వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మాత్రం శ్రద్ధ కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయింది అంటూ తెలుస్తోంది. నిజానికి వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే సినిమాలో ఇప్పటివరకు ఎలాంటి నటీనటులను ఎంపిక చేయలేదు. ఎందుకంటే ప్రస్తుతం ఆయన ప్రభాస సలార్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇకపోతే ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందట. అందుకే ఆ పాత్రలో ఒక స్టార్ హీరోయిన్ ఉంటే బాగుంటుందని భావిస్తున్నారట చిత్ర బృందం. జూనియర్ ఎన్టీఆర్ కోసం ఇప్పటివరకు ఎవరు చేయని కథను రెడీ చేస్తున్నాడట ప్రశాంత్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: