'ఉస్తాద్ భగత్ సింగ్' టీజర్ హైలైట్స్.. ఫ్యాన్స్ కి పూనకలు గ్యారెంటీ..!!

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీస్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా ఒకటి. గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరిష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభించుకొని ఓ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది. ఇక తాజాగా రెండో షెడ్యూల్ షూటింగ్ కి సిద్ధమవుతోంది. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ - పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ వీడియోని ఈనెల 11వ తేదీన విడుదల చేయబోతున్నారు. గబ్బర్ సింగ్ చిత్రం రిలీజ్ అయి మే 11వ తేదీకి 11 సంవత్సరాలు పూర్తవుతాయి. 

ఈ సందర్భంగా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ టీం సోషల్ మీడియా వేదికగా అధికారికంగా తెలిపారు. అయితే ఈ టీజర్ గ్లిమ్స్ ఎలా ఉండబోతుంది అనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో రోజురోజుకీ పెరిగిపోతుంది.ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ టీజర్ గ్లిమ్స్ ప్రారంభంలో గబ్బర్ సింగ్ 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమాలో కొన్ని షాట్స్ ముందు చూపిస్తారట. ఆ తర్వాత 'ఇప్పుడే మొదలైంది' దగ్గర నుండి ప్రారంభించి 'మళ్ళీ మొదలైంది' అనే టైటిల్ తో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ వస్తుందట. అంతేకాదు ఈ గ్లిమ్స్ లో పవన్ కళ్యాణ్ రెండు పవర్ఫుల్ డైలాగ్స్ తో పాటు ఓ యాక్షన్ సీన్ కూడా ఉంటుందట.

గబ్బర్ సింగ్ అప్పుడు టీజర్ ఫ్యాన్స్ కి ఎలాంటి అనుభూతి ఇచ్చిందో.. దానికి మించేలా ఈ గ్లిమ్స్ వీడియో ఉండబోతుందని అంటున్నారు. మరి గబ్బర్ సింగ్ ని మించి ఈ గ్లిమ్స్ వీడియో ఉంటే మాత్రం సోషల్ మీడియా షేక్ అవ్వాల్సిందే. ముఖ్యంగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఈ గ్లిమ్స్ వీడియోకి రికార్డు స్థాయిలో వ్యూస్ అండ్ లైక్స్ ని రప్పించేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ మొదలెట్టారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: