డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 105 థియేటర్ల లో 'ఆదిపురుష్' ట్రైలర్..?

Anilkumar
టాలీవుడ్ యాంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ 'ఆది పురుష్'. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం డార్లింగ్ ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. టి సిరీస్ బ్యానర్పై భూషణ్ కుమార్ సుమారు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ అయిన అప్డేటెడ్ టీజర్, పోస్టర్స్ మంచి రెస్పాన్స్ ని అందుకుని సినిమాపై అంచనాలను పెంచేశాయి. మొదటిసారి ఈ సినిమాలో శ్రీరాముడిగా కనిపించనుండగా.. సీత పాత్రలో బాలీవుడ్ బ్యూటీ కృతి  సనన్ నటిస్తోంది. 
అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణుడిగా సన్నిసింగ్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ మూవీ నుండి కృతి సనన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా.. ఇప్పుడు ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్తూ కి మరో అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. ఆదిపురుష్ ట్రైలర్ ని ఏకంగా 105 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారట. ఈ నెల 9 వ తేదీన ఆదిపురుష్ 3D ట్రైలర్ ని తెలంగాణ,ఏపీ లో 105 థియేటర్స్ లో ప్రదర్శించేందుకు నిర్మాతలు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇక ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆది పురుష్ మూవీ మరోసారి వాయిదా పడుతుందని రూమర్లు రావడంతో తాజాగా ఈ అప్డేట్ ని అందించారు మూవీ యూనిట్. 
ఈసారి ఆది పురుష్ మళ్లీ వాయిదా పడే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదని, ఆది పురుష్ విడుదల తేదీలో ఎటువంటి మార్పు లేదని మేకర్స్ ప్రకటించారు. త్వరలో ప్రమోషన్లు కూడా ప్రారంభమవుతాయని మే 9న సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు ట్రైలర్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఇక జూన్ 16న ఆదిపురుష్ పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది. సాహో, రాదేశ్యామ్ వంటి వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న ప్రభాస్ కి ఆది పురుష్ మూవీ ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: