జాన్వీ కపూర్ తెలుగు ఆదాయం ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైంది జాన్వి కపూర్.ఈమె పేరు వింటేనే కుర్ర కారు గుండెల్లో హీట్ పెరిగిపోతుంది. ఎంతో అందంగా తన హాట్ లుక్ తో ఎంతమంది అభిమానులను సంపాదించుకుంది జాన్వి కపూర్. దడల్ సినిమాతో 2018 రోజుని ఇండస్ట్రీకి ఎంట్రీ వచ్చింది ఈ ముద్దుగుమ్మ .అనంతరం చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ లిస్టులో కి చేరిపోయింది. దాని అనంతరం ఘోస్ట్ స్టోరీస్ అంగ్రేజీ మీడియం గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ రూహి గుడ్ లక్ జెర్రీ మిలి బావాల్ మిస్టర్ అండ్ మిస్సెస్ మహి వంటిపలు సినిమాలలో నటించి మెప్పించింది జాన్వి. 

తాజాగా జాహ్నవి కపూర్ జూనియర్ ఎన్టీఆర్ 30 సినిమా లో సైతం హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే ఆమె తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతోంది. కేవలం జూనియర్ ఎన్టీఆర్ సరసన మాత్రమే కాకుండా మరికొంతమంది స్టార్ హీరోల సరసన హీరోయిన్గా నటించబోతోందట జాన్వి కపూర్. అయితే ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఒక సినిమాలో నటించేందుకు జాన్వి కపూర్ ఎంపికైనట్లుగా తెలుస్తోంది.దాంతోపాటుగా అఖిల్ అక్కినేని సినిమాలో కూడా హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుందట జాన్వికపూర్. అయితే టాలీవుడ్ ను ఏలుతున్న మూడు పెద్ద ఫ్యామిలీల యంగ్ హీరోల సరసన నటించే అవకాశాన్ని జాన్వికపూర్ కొట్టేయడంతో అందరూ షాక్ అవుతున్నారు.

అయితే ఈ ముగ్గురితోనే కాకుండా మరో రెండు మూడు ప్రాజెక్టుల్లో సైతం నటించే అవకాశాన్ని జాన్వి కపూర్ దక్కించుకున్నట్లుగా వార్తలు అయితే వినబడుతున్నాయి. టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిందో లేదో ఒక సినిమా కూడా విడుదల కాకముందే దాదాపుగా అరడజనుకు పైగానే సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకోవడంతో ఈమెకి మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. అయితే జాన్వి కపూర్ ఒక ప్రాజెక్టుకు దాదాపుగా నాలుగు నుండి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టులన్ని పూర్తయ్యేసరికి మరో రెండు మూడేళ్లు పడుతుంది. అయితే ఈ రెండు మూడేళ్ల గ్యాప్ లో జాహ్నవికపూర్ దాదాపుగా 20 కోట్లకు పైగాని సంపాదిస్తుందన్నమాట. ఈ సినిమాల క్రేజ్ తో జాన్వికపూర్ మరిన్ని అవకాశాలు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వినబడుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: