సమంత కి గుడి కట్టిన వీరాభిమాని.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన నటానికి ఎంత మంది అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సమంత నటి మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా.. మధ్యతరగతి జీవితాన్ని అనుభవించి ఇంత పెద్ద స్థాయికి ఎదిగిన సమంతకి పేదల కష్టాలు చాలా బాగా తెలుసు. అందుకే సమంత తనకి సమయం దొరికిన ప్రతిసారి సేవా కార్యక్రమాలను చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లను చేయించడంలో ఆమె చూపిన చొరవ చెప్పలేనిది అనే చెప్పాలి. 

ఈ క్రమంలోని సమంత మానవత్వానికి ఫిదా అయిపోయాడు ఒక వీరాభిమాని. సమంతపై తనకి ఉన్న అభిమానంతో ఏకంగా సమంతకి గుడి కట్టాడు ఆ అభిమాని. ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే ఒక యువకుడు సమంతా కి పెద్ద అభిమాని. ఆమె నటనతో పాటు తన సేవా కార్యక్రమాలకు ఫిదా అయిన ఆయన ఏకంగా సమంతకి గుడి కట్టాడు. అయితే ఎందరో అనారోగ్యం పాలైన చిన్న పిల్లలకు సమంత పునర్జన్మ ఇవ్వడంతో తనపై ఉన్న అభిమానం మరింత ఎక్కువ అవ్వడంతో సమంతకి ఏకంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు ఆ అభిమాని.

అనంతరం తన ఇంటి ప్రాంగణంలో ఆలయం కోసం కొంత స్థలం కేటాయించి విగ్రహాన్ని సైతం తయారు చేయించాడు ఆ అభిమాని. అయితే ప్రస్తుతం ఇప్పుడు విగ్రహానికి గుడికి తుది మెరుగులు దిద్ది పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. అంతేకాదు ఈనెల 28వ తేదీన ఆ ఆలయం ప్రారంభిస్తున్నట్లు సమంత వీరాభిమాని సందీప్ తెలియజేశారు. అంతేకాకుండా ఎప్పటికైనా సమంతను కలుస్తానని సమంతను కలిసే అవకాశం వస్తే అసలు వదులుకోను అంటూ సమంత పై తనకి ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు సందీప్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: