హీరోయిన్ ఆఫర్ కోసం రెండు సార్లు ఆ పని చేశా: డింపుల్ హయాతి

Anilkumar
డస్కీ బ్యూటీ డింపుల్ హయాతి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన 'గద్దల కొండ గణేష్' అనే మూవీలో 'జర్రా జర్రా' అనే పాటతో ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. ఆకట్టుకునే అందం మంచి టాలెంట్ ఉన్నా.. హీరోయిన్గా మాత్రం డింపుల్ హయాతికి ఒక్క సక్సెస్ కూడా రాలేదు. ఈ హీరోయిన్ నటించిన సినిమాలన్నీ ప్లాప్స్ అవడంతో ఈమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ కూడా తగిలించారు. అయితే తాజాగా ఈ హీరోయిన్ మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయింది. ఆ సినిమా పేరే 'రామబాణం'. మ్యాచో హీరో గోపీచంద్-  శ్రీవాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ సినిమా ఇది. 

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై వివేక్ కూచిభట్ల, టిజి విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటించింది. సీనియర్ నటుడు జగపతిబాబు,ఖుష్బూ, శుభలేఖ సుధాకర్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా వేసవి కానుకగా మే 5న విడుదల కాబోతోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర రాయడంతో సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు మేకర్స్. వరుస ప్రమోషన్ చేస్తూ సినిమాపై మరింత హైప్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డింపుల్ హయాతి తన కెరీర్ గురించి పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. 'తన సినీ కెరీర్లో ఇప్పటికే ఐదేళ్లు గడిచిన ఇంకా తాను బేబీ స్టెప్స్ వేస్తున్నానని చెప్పింది.

నేనింకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇక రామబాణం సినిమాలో నేను యూట్యూబ్ బ్లాగర్ భైరవి పాత్రలో కనిపిస్తాను. ఈ సినిమాలో హీరోయిన్ ఆఫర్ కోసం నేను రెండు ఆడిషన్స్ ఇచ్చాను. అలా రెండుసార్లు ఆడిషన్ ఇచ్చిన తర్వాతే సినిమాలో భైరవి పాత్రకు నేను సరిపోతానని శ్రీవాస్ గారికి నమ్మకం వచ్చింది. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ సాధిస్తుంది' అంటూ తాజా ఇంటర్వ్యూలో పేర్కొంది ఈ హీరోయిన్. మరి రామబాణం సినిమాతోనైనా డింపుల్ హయాతికి సక్సెస్ వస్తుందేమో చూడాలి. ఇక రామబాణం సినిమా నుండి ఇప్పటికే విడుదలైన సాంగ్స్, ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం వరుస హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకి ఈ సినిమా మరో హిట్ అందిస్తుందేమో చూడాలి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: