చిన్న సినిమా కోసం భారీగా ఖర్చు పెట్టిన 'ఆహా'..?

Anilkumar
ఈమధ్య మన అగ్ర హీరోల సినిమాల కంటే చిన్న సినిమాలకే మంచి సక్సెస్ రేట్ వస్తోంది వస్తోంది. చిన్న బడ్జెట్ అయినా అందులో మంచి కంటెంట్ ని ఆడియన్స్ కి అందిస్తున్నారు నిర్మాతలు. అందుకే ఈ మధ్య చిన్న సినిమాలు కూడా ప్రేక్షకుల దృష్టిని ఎంతో ఆకర్షిస్తున్నాయి. అలా ప్రస్తుతానికి సినీ ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఓ చిన్న సినిమా 'బేబీ'. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తుండగా.. సాఫ్ట్వేర్ డెవలపర్ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తోంది. కేవలం ప్రమోషనల్ కంటెంట్ తోనే ఈ సినిమాపై ఒక రేంజ్ లో హైప్ పెరిగిపోయింది. 

ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ మూవీ డిజిటల్ రైట్స్ కి కూడా ఇప్పుడు భారీగా డిమాండ్ పెరిగిపోయింది. ఇదే క్రమంలోనే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా వారు ఏకంగా 7.5 కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే ఆహా వారు ఓ చిన్న సినిమా కోసం ఇంత భారీ బడ్జెట్ పెట్టడం ఇదే మొదటిసారి. అయితే ఆహా వారికంటే ముందు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కూడా ఈ సినిమా నిర్మాతలకి భారీ మొత్తాన్ని ఆఫర్ చేశారట. కానీ చివరగా ఈ మూవీ స్ట్రీమింగ్ రైట్స్ ను ఆహా ఓటీటీ సంస్థ దక్కించుకుంది. ఈమధ్య చిన్న సినిమాలుగా వచ్చిన మసూద, రైటర్ పద్మభూషణ్, బలగం వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలు అందుకున్నాయి. అంతేకాదు చిన్న బడ్జెట్ సినిమాల్లోనే ఆడియన్స్ కి మంచి కంటెంట్ దొరుకుతుంది.

అందుకే ఈమధ్య చిన్న బడ్జెట్ సినిమాలకి భారీగా డిమాండ్ పెరిగిపోయింది. అలా 'బేబీ' మూవీ కి కూడా అదే డిమాండ్ ఉండగా.. రేపు బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి. అయితే ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ డేట్ ని మేకర్స్ ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉంది. మాస్ మూవీ మేకర్స్ పతాకంపై కేఎస్ఎన్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక దొరసాని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ కి తన అన్న విజయ్ దేవరకొండకు వచ్చినంత క్రేజ్ రాలేదు. ఎందుకంటే ఇప్పటివరకు  ఆనంద దేవరకొండ నటించిన సినిమాలేవి పెద్దగా హిట్ అవ్వలేదు. అయితే ప్రస్తుతం నటిస్తున్న బేబీ సినిమాపై మంచి బజ్ ఉండడంతో ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే ఆనంద్ దేవరకొండ కి మంచి ఆఫర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: