'గేమ్ ఛేంజర్'మూవీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి మాధవ్ బుర్రా..?

Anilkumar
సంచలన దర్శకుడు శంకర్ డైరెక్షన్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'గేమ్ చేంజర్'. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలిసిందే. సినిమాపై ఎన్ని అంచనాలైనా వాటిని మించేలా ఈ సినిమా ఉంటుందని తాజాగా ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్ర చెప్తున్నారు. సాయి మాధవ్ బుర్ర తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో గేమ్ చేంజర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. గేమ్ చేంజర్ సినిమా రామ్ చరణ్ ఇమేజ్ను గ్లోబల్ స్థాయిలో పెంచే విధంగా ఉంటుందని అన్నారు..' గేమ్ చేంజర్ మూవీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. 

ఆడియన్స్ ఆ సినిమా ఎలా ఉండాలని అనుకుంటున్నారో అంతకంటే బాగుంటుంది. శంకర్ గారు కూడా ఎంతో క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయన డైరెక్ట్ చేసిన జెంటిల్మెన్ మూవీ చూసి లైఫ్ లో ఒక్కసారైనా అయనతో ఫోటో దిగితే చాలు అనుకున్నాను. అలాంటిది నాకు ఆయనతో కలిసి పని చేసే ఛాన్స్ వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సినిమా కూడా చాలా గ్రాండియర్ గా ఉంటుంది. ప్రతి షాట్ కూడా అద్భుతం అనే లాగా డైరెక్టర్ గారు చిత్రీకరిస్తున్నారు. కావాలని ఏదో ఖర్చు పెడుతున్నట్లు ఉండదు. ఆయన తీసే షాట్ కి అంత ఖర్చు అవసరం.. అంతమంది టెక్నీషియన్స్ అవసరం. గేమ్ చేంజర్ చాలా పెద్ద కథ. ఈసారి చాలా స్ట్రాంగ్ కాన్సెప్ట్ తో వస్తున్నారు' అంటూ సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేశారు సాయి మాధవ్ బుర్ర.

దీంతో గేమ్ ఛేంజర్ మూవీ పై ఈ రచయిత చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం మూవీ విషయంలో కూడా సాయి మాధవ్ ఇలానే చెప్పారు. గుణశేఖర్ గారి డైరెక్షన్, సమంత యాక్టింగ్ అద్భుతం అన్నట్టు చెప్పారు. కానీ ఆ సినిమా రిజల్ట్ ఏంటో మనకు తెలిసిందే. కాబట్టి సినిమాకు ముందు ఏ రచయిత అయినా ఇలానే చెబుతాడు. కానీ మూవీ రిలీజ్ అయ్యాక సినిమా రిజల్ట్ ని డిసైడ్ చేసేది ఆడియన్స్ మాత్రమే. ఇక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, జయరామ్, ఎస్ జె సూర్య తదితరులు ఇతర కీలక పాత్ర పోషించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: