సలార్ Vs పుష్ప2 .. ఆ రికార్డ్ ఎవరి సొంతం అవుతుందో..?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ప్లాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో సలార్, పుష్ప2 ఈ రెండు సినిమాల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తి గా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రెండు సినిమాలపై ఓ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక రెండిట్లో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సలార్ మూవీ ముందుగా థియేటర్స్ లో సందడి చేయనుంది. ఇక ఆ తర్వాత వచ్చే ఏడాది వేసవి కానుకగా పుష్ప2 రిలీజ్ అవ్వనుంది. ఇక సలార్ మూవీ ని కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నిల్ డైరెక్ట్ చేస్తుంటే.. పుష్ప2 ని క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాలకు ఇప్పుడు భారీ స్థాయిలో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి. 

ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల్లో బిజినెస్ విషయంలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందనే చర్చ జరుగుతోంది.ఇక్ అటు సలార్ ఇటు పుష్ప2 రెండు సినిమాలను తక్కువ అంచనా వేయలేం. ఈ రెండు మూవీస్ కి తెలుగు తో పాటు ఇతర భాషల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సినిమాలు రికార్డ్ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ లు జరుపుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ట్రేడ్ పండితులు చెబుతున్న దాని ప్రకారం సలార్, పుష్ప2 సినిమాలకు వేరువేరుగా సుమారు 700 నుంచి 800 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగే అవకాశం ఉందట. అయితే ఇప్పటివరకు సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కల్లో టాప్ వన్ లో ఉండగా..

ఈ రికార్డుని సలార్, పుష్ప2 సినిమాలు ఈజీగా బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక డార్లింగ్ ఫాన్స్ సలార్ మూవీ ప్రభాస్ కెరియర్ లోనే బెస్ట్ మూవీ అవుతుందని అంటుండగా.. ఇటు బన్నీ ఫాన్స్ కూడా పుష్ప తో అల్లు అర్జున్ ఈసారి పాన్ వరల్డ్ హీరో అవ్వడం గ్యారెంటీ అని అంటున్నారు. ఇక ఈ ఇద్దరు హీరోలు కూడా ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్స్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి రాబోయే రోజుల్లో సలార్, పుష్ప2 రెండు సినిమాల్లో ఏ సినిమా ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకొని త్రిబుల్ ఆర్ రికార్డును బ్రేక్ చేస్తుందో చూడాలి? ఇక ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలోనే ఉన్నాయి. అందులో సలార్ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకోగా.. పుష్ప2 ఇప్పటికే 3 భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: