క్యూట్ స్మైల్ తో కిల్లింగ్ లుక్స్ లో మైమరపిస్తున్న అనుపమ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నితిన్ హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుపమ ఆ తర్వాత ఎన్నో క్రేజీ తెలుగు మూవీ లలో అవకాశాలను దక్కించుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ బిజియేస్ట్ నటి గా కెరియర్ ను కొనసాగిస్తుంది . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దు గుమ్మ చాలా సినిమాలలో హీరోయిన్ గా నటించింది .
 

అందులో కార్తికేయ 2 మూవీ అద్భుతమైన బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో అనుపమ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది. ఆఖరుగా అనుపమ "18 పేజెస్" అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో నిఖిల్ హీరో గా నటించాడు. ఇది ఇలా ఉంటే సినిమాలతో ప్రేక్షకులను ఎంత గానో అలరిస్తున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది.
 

అలాగే తనకు సంబంధించిన ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా అనుపమ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో ఈ ముద్దు గుమ్మ అదిరిపోయే క్యూట్ స్మైల్ తో ... కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: