కాజల్ ట్వీట్ పై మెగా ఫ్యాన్స్ ఫైర్..?

Anilkumar
సౌత్ లో స్టార్ హీరోయిన్గాఓ వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ ఆ మధ్య పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తల్లాయ్యాక సినిమాలపరంగా కొంత గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ మళ్ళీ స్పీడ్ పెంచేందుకు పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళ్తోంది. పెళ్లికి ముందే కమిట్ అయిన ఇండియన్ 2 మూవీ ని పూర్తి చేసి త్వరలో బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న ఎన్బికె 108 షూటింగ్లో పాల్గొనబోతోంది. అయితే ఈ సినిమా కోసం కాజల్ ని ఎంపిక చేశారా? లేదా? అనే విషయాన్ని మూవీ టీమ్ ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు. కానీ మొత్తం మీద కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఫైనల్ అయిందని టాక్ వినిపిస్తోంది. 

ఈ విషయం కాస్త పక్కన పెడితే.. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కాజల్ మీద ఫుల్ ఫైర్ అవుతున్నారు. దానికి ఓ రీజన్ ఉంది. అదేంటంటే.. నిన్న ఆస్కార్ వేడుకలు ముగిసిన అనంతరం త్రిబుల్ ఆర్ టీమ్ ను పలు ఇండ్రస్ట్రీ లకు చెందిన సెలబ్రిటీలు అభినందనలు తెలిపిన విషయం తెలిసిందే. అందులో కాజల్ కూడా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఆస్కార్ ట్రోపీ పట్టుకున్న పిక్ ని  రీ ట్వీట్ చేస్తూ బిగ్ కంగ్రాట్యులేషన్స్ అంటూ కాజల్ మెసేజ్ పెట్టింది. మరో పేజీలో మూవీ టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతూ అందరినీ ట్యాగ్ చేసింది. కానీ అందులో మాత్రం ఎటువంటి ఫోటో పెట్టలేదు. ఇక్కడే మెగా ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. 

తన కెరీర్లో బిగ్ బ్లాక్ బస్టర్ మగధీర సినిమానిచ్చిన రాజమౌళిని కానీ రామ్ చరణ్, కీరవాణి బృందానికి స్పందన తెలియజేయడం ఇలాగేనా అంటూ మెగా ఫాన్స్ కాజల్ పై ఫైర్ అవుతున్నారు. అయితే కాజల్ ఇలా చేయడానికి బయట కనిపించని యాంగిల్ ఒకటి ఉంది. అదేంటంటే.. ఆచార్య సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో ఒక పాట కొన్ని సీన్లు కూడా తీసేశారు. ఆ తర్వాత ఫైనల్ ఎడిటింగ్ లో తన క్యారెక్టర్ మొత్తం కట్ చేశారు. ఇక ఆచార్య నిర్మాతల్లో రామ్ చరణ్ కూడా ఒకరు.దాన్ని మనసులో పెట్టుకునే కాజల్ ఇలా చేసి ఉండవచ్చని కొంతమంది అంటున్నారు.లేకుంటే కేవలం ఎన్టీఆర్ మాత్రమే హైలెట్ చేసి రామ్ చరణ్ పేరు ఫోటో వాడకపోవడం ఏంటనేదే ఇప్పుడు ఫాన్స్ అడుగుతున్న ప్రశ్న. మరి కావాలనే కాజల్ ఇలా చేసిందా? లేదా? అని తెలియాలంటే ఆమె స్వయంగా దీనిపై స్పందించాలి...!!మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: