అల్లు అర్జున్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమా ఏంటో తెలుసా..?

Anilkumar
టాలీవుడ్ అగ్ర హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొడుకుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బన్నీ హీరోగా మారి ఎన్నో విజయాలను అందుకున్నాడు. గంగోత్రి సినిమా ద్వారా హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆర్య, దేశముదురు, పరుగు వంటి సినిమాలో నటించి మంచి హిట్స్ అందుకున్నాడు. అయితే గంగోత్రి సినిమా సమయంలో బన్నీ ఎన్నో విమర్శలు కూడా అందుకున్నాడు. చాలామంది బన్నీ ముఖాన్ని చూసి అప్పుడు ఇతను హీరోగా పనికిరాడు అని అన్నారు. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ తెచ్చుకుని ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. 

ఇదిలా ఉంటే అల్లు అర్జున్ కెరీర్ మొదట్లో హీరో గానే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడాఓ సినిమాకి పనిచేశాడట. బన్నీ దర్శకులతో నిర్మాతలతో ఎంతో ఫ్రెండ్లీగా ఉంటాడు. ముఖ్యంగా తన సినిమాలకు పనిచేసిన డైరెక్టర్ తో బన్నీకి ఎంతో మంచి బాండింగ్ ఉంటుంది. అలాంటి బన్నీ ఓ సీనియర్ డైరెక్టర్ కి ఇప్పటికీ భయపడతారట. ఆయన ఎవరో కాదు ఎస్వీ కృష్ణారెడ్డి. ఈయన టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించారు.ఇదిలా ఉంటె 'పెళ్ళాం ఊరెళితే' సినిమా సమయంలో అల్లు అర్జున్ ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారట. ఆ సమయంలో సెట్ లో ఉన్న అందరిని కృష్ణారెడ్డి చాలా క్రమశిక్షణగా ఉంచేవారట.

ఇక అల్లు అర్జున్ విషయంలో కూడా ఆయన ఎంతో స్ట్రిక్ట్ గా ఉండేవారట. అందుకే అప్పటి నుంచి ఇప్పటికీ ఎస్వీ కృష్ణారెడ్డి గారు అంటే బన్నీకి భయమేనట. అయితే బన్నీ ఓ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడనే విషయం ఇప్పటికీ చాలామందికి తెలియదు. ఇక బన్నీ ప్రస్తుతం పుష్ప2 సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ కూడా పూర్తయ్యాయి. త్వరలోనే మూవీ టీం షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళబోతున్నారు.ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటిస్తుండగా.. సునీల్, అనసూయ, ఫాహాద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, ప్రియమణి, తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: