ఆ స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలు కాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..!?

Anilkumar
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా కూడా తమిళ ఇండస్ట్రీలో గతంలో హీరోయిన్గా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ పేరే వినిపిస్తోంది. ప్రస్తుతం ఏమి లేడీ విలన్ గా పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది .విలన్ క్యారెక్టర్ లకు పెట్టింది పేరుగా మారిపోయింది వరలక్ష్మి శరత్ కుమార్. ఈ క్రమంలోనే ఈ హీరోయిన్ సినిమాలో చనిపోతే గనక ఆ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంటుంది అంటూ ఒక సెంటిమెంట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి కోడలు కాబోతుంది అన్న వార్తలు వైరల్ అయితే అవుతున్నాయి. ఇక అసలు విషయం ఏంటి అంటే.. 

నటుడు శరత్ కుమార్ కూతురుగా సినీ ఇండస్ట్రీకి వరలక్ష్మి శరత్ కుమార్ మొదట్లో ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించింది సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడం ఇష్టం లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది .గతంలో ఆమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపును తెచ్చుకోలేకపోయింది. కానీ ఇప్పుడు టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విలన్ క్యారెక్టర్ లో చేసి హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ ని సంపాదించుకుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. తెనాలి రామకృష్ణ అనే సినిమాలో విలన్ గా నటించింది ఈమె. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాలో తన పాత్రకి మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమా అనంతరం క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో కూడా నటించింది ఈమె.

అనంతరం స్టార్ విలన్ గా కూడా మంచి పేరును తెచ్చుకుంది. దీని అనంతరం యశోద సినిమాలో కూడా విధంగా నటించి మరింత గుర్తింపును తెచ్చుకుంది. ఈ మధ్యకాలంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో భానుమతి క్యారెక్టర్ లో వరలక్ష్మి శరత్ కుమార్ జీవించింది అని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇక ఈమెకి ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా వరలక్ష్మి పెళ్లి మాత్రం చేసుకోలేదు. తాజాగా ఫిలిం ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న వార్తల ప్రకారం ఒక స్టార్ ప్రొడ్యూసర్ ఇంటికి తను కోడలుగా వెళ్లబోతుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయాన్ని తన తండ్రి శరత్ కుమార్ కి కూడా చెప్పి ఒప్పించిందట వరలక్ష్మి శరత్ కుమార్. ఈ నేపథ్యంలోనే శరత్ కుమార్ కూడా ఆ స్టార్ ప్రొడ్యూసర్ తో వియ్యంకులుగా మారిపోదాం అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఈ విషయంపై వరలక్ష్మి మాత్రం ఇప్పటికీ స్పందించలేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: