ఛత్రపతి విలన్ భార్యను ఎప్పుడైనా చూసారా?.. స్టార్ హీరోయిన్లు కూడా పనికిరారు..!!

Anilkumar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చత్రపతి సినిమా అందరూ చూసే ఉంటారు.రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆ సినిమాలో విలన్ ఎవరో తెలుసు కదా. కేవలం చత్రపతి సినిమా మాత్రమే చాలా సినిమాల్లో విలన్ గా నటించాడు ప్రదీప్ రావత్. సినిమాలో విలన్ అంటే ఆయనలాగే ఉండాలి అన్నట్టుగా ఉంటుంది ఆయన విలనిజం. ఇక చత్రపతి సినిమాలో ఆయన విలనిజం చూసి ప్రతి ఒక్కరూ భయపడ్డారు. అంత భయంకరంగా ఉంటుంది ఆయన విలనిజం. నిజానికి చాలామందికి ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. ఆయన అసలు పేరు కూడా ఇప్పటికీ చాలామందికి తెలీదు. ఇప్పటికీ ఈయన్ని అందరూ చత్రపతి విలన్ అని అంటుంటారు. 

నిజానికి ఈయన లగాన్ సినిమాలో కూడా నటించాడు. ఆ సినిమాలో ఓ క్యారెక్టర్ చేశాడు. ఆ సినిమా చూసే మన రాజమౌళి ఆయనకు సై సినిమాలో విలన్ పాత్రకు ఆఫర్ ఇచ్చారు. ఇక విలన్ ప్రదీప్ రావత్ ది మధ్యప్రదేశ్లోని జబల్ పూర్. చత్రపతి మూవీ తర్వాత ఆయనకు తెలుగులో వరుసగా విలన్ అవకాశాలు వచ్చాయి. దీంతో దేశముదురు, రాజన్న, పూలరంగడు, బాద్షా, సరైనోడు, లయన్, రగడ, అల్లుడు శీను వంటి అనేక సినిమాల్లో విలన్ గా నటించాడు. అయితే ఈ విలన్కు ఓ అందమైన భార్య ఉంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రదీప్ భార్యకు సంబంధించిన ఫోటోలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈమె పేరు అన్సా సింగ్.

ఇటీవల ఈమె పుట్టినరోజు వేడుకలను ఓ స్టార్ హోటల్లో నిర్వహించగా.. ఈ సందర్భంగా ప్రదీప్ రావత్ భార్యతో కలిసి సందడి చేశాడు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రదీప్ రావత్ భార్యని చూసిన నెటిజెన్స్ చాలామంది ఈమె ఎంతో అందంగా ఉందని కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు చత్రపతి విలన్ భార్య హీరోయిన్లనే మించిపోయి ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అంతటా విలన్ ప్రదీప్ రావత్ భార్య ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వేరే సినిమాలో కూడా ప్రదీప్ రావత్ నటించాడు. అయితే ఈ సినిమాలో విలన్ గా కాకుండా ఎప్పుడూ మెగాస్టార్ వెంట ఉండే క్యారెక్టర్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ప్రదీప్ రావత్ సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ.. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెరుస్తున్నాడు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: