రామబాణం రిలీజ్: వేసవికి కలుద్దాం అంటున్న గోపిచంద్..!!

Anilkumar
గత ఏడాది 'పక్కా కమర్షియల్' అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన యాక్షన్ హీరో గోపీచంద్.. ఇప్పుడు 'రామబాణం' అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇక ప్రస్తుతం తెరకెక్కిన రామబాణం సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈరోజు ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. మే 5వ తేదీన రామబాణం సినిమాను విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ ని కూడా విడుదల చేస్తూ..' బాగా చదవండి. పరీక్షలు బాగా రాయండి. వేసవి సెలవుల్లో కలుద్దాం'.. అంటూ పోస్టర్ మీద పేర్కొన్నారు. 

ఇక ఈ పోస్టర్లో గోపీచంద్ మాస్ లుక్ తో అదరగొట్టేసాడు. ఇప్పటికే విడుదల చేసిన గ్లిమ్స్ వీడియో కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు ఓ సోషల్ ఇష్యూ ని కూడా డిస్కస్ చేయబోతున్నారట. ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఒక సామాజిక సమస్యను తీసుకొని దానికి మంచి కమర్షియల్ హంగులు జోడించి దర్శకుడు శ్రీనివాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో హీరో ఇజం తో పాటు ఫ్యామిలీ బాండింగ్, ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. ఇక ఆ సోషల్ ఇష్యూ ఏంటి అనేది ఈ మూవీ ట్రైలర్ లో రివిల్ చేసే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాలో గోపీచంద్ విక్కీ అనే పాత్రలో నటిస్తున్నాడు.

ఇక గోపీచంద్ యాక్షన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని దర్శకుడు శ్రీవాస్ సినిమాలో వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్లను డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.ఇది గోపీచంద్ కెరియర్ లో 30వ సినిమా కావడం మరో విశేషం. ఇటీవల కార్తికేయ2, ధమాకా సినిమాలతో మంచి విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. వివేక్ కూచిభట్ల సహనిర్మాత. అన్నట్టు ఈ సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయాతి హీరోయిన్గా నటిస్తుండగా.. జగపతిబాబు, కుష్బూ తదితరులు కీలకపాత్రను పోషిస్తున్నారు. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు...!!మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: