ఎన్టీఆర్ 30 సినిమాకి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపును తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ సినిమా అనంతరం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా త్వరలోనే రానున్న సంగతి మనందరికీ తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా ఇది. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక ఇటీవల ఈనెల 24న లాంచనంగా ప్రారంభం కావాల్సిన ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ అన్న తారకరత్న మరణం కారణంగా వాయిదా పడింది. 

ఈ క్రమంలోనే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని మార్చి 18 నుండి ప్రారంభించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవం మార్చి 12న అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో జరగబోతుంది. ఇక ఆ వేడుకలో పాల్గొనేందుకు త్రిబుల్ ఆర్ చిత్ర బృందం అమెరికాకు కూడా వెళ్లడం జరిగింది. ఈ క్రమంలోనే త్వరలోనే జూనియర్ ఎన్టీఆర్ కూడా అక్కడికి వెళ్ళనున్నాడు. ఆస్కార్ వేడుకలు పూర్తయిన వెంటనే జూనియర్ ఎన్టీఆర్ మరియు కొరటాల శివ కాంబినేషన్లో రానున్న సినిమాని ప్రారంభించనున్నారని తెలుస్తోంది. అంతేకాదు ఏప్రిల్ మొదటి వారం నుండి ఈ సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్

కూడా ప్రారంభించే దిశగా వెళతారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు పరిటాల శివ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్  సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటించనుందని  గత కొంతకాలంగా వర్తలైతే వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయానికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చిత్ర బృందం బయట పెట్టలేదు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో జాన్వి కపూర్ నటిస్తే ఈ సినిమాతోనే తను తెలుగులో ఎంట్రీ చేస్తుందన్నమాట..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: