చిరు తో పూరి జగన్నాథ్ సినిమా ఫిక్స్.. ఎప్పుడంటే..!?

Anilkumar
ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో విజయ్ దేవరకొండ తో చేసిన లైగర్ సినిమా కూడా అంతటి రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందని భావించాడు పూరి జగన్నాథ్. కానీ ఎవరూ ఊహించిన విధంగా ఈ సినిమా భారీ డిజాస్టర్ ను అందుకుంది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కావడంతోపాటు విజయ్ దేవరకొండ క్రేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాని నిర్మించడం జరిగింది. కానీ ఎవరు ఊహించిన విధంగా ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో పాటు పూరి జగన్నాథ్ మాత్రమే కాకుండా సహనిర్మాతగా ఉన్న కరణ్ జోహార్ డబ్బు కూడా ఈ సినిమాతో కోల్పోవాల్సి వచ్చింది. 

ఈ సినిమా ఊహించిన విధంగా ఇంతటి డిజాస్టర్ గా మిగలడంతో మరే సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు పూరి జగన్నాథ్మ్ నిజానికి విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ తో జనగణమనే అనే మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. కానీ లైజర్ సినిమా చేసిన పనికి ఆ సినిమాను కూడా పక్కన పెట్టేయడం జరిగింది. ఇక సినిమా నిర్మాతలైన వంశీ పైడిపల్లి జూపల్లి గ్రూప్ కూడా ఈ సినిమాని వద్దు అని నిర్ణయం తీసుకున్నారు. ఇలాంటి నిర్ణయం తర్వాత ఈ సినిమా ఏ హీరోతో చేస్తారు అన్నది మాత్రం ఇప్పటివరకు తెలియదు. ఈ నేపథ్యంలోనే పూరి జగన్నాథ్ తనకున్న పరిచయాలతో ఎవరైనా స్టార్ హీరోతో సినిమా చేసే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తుంది.

అయితే తాజాగా ఆ ప్రచారాల్ని నిజమైనట్టుగా కనిపిస్తుంది. ఇక అసలు విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి మరియు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో ఒక సినిమా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. షాడో ఫ్లోప్ తర్వాత సుమారు 7 నుండి 8 ఏళ్ల పాటు సినిమాలకు దూరమైన మెహర్ రమేష్ కి బోలాశంకర్ సినిమా తీస్తే అవకాశాన్ని ఇచ్చాడు చిరు. ఇక ప్రస్తుతం అదే బాటలో మెగాస్టార్ చిరంజీవి లైగర్ సినిమా డిజాస్టర్ తర్వాత పీకల్లోతో బాధలోకి వెళ్ళినప్పుడు జగన్నాథ్ కి కూడా మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అదే తరహాలో ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది.అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పూరి జగన్నాథ్ మరియు చిరంజీవి కాంబినేషన్లో సినిమా దాదాపుగా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చేయనున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోల శంకర్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే వెంకీ కుడుముల దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా అయిపోతుందన్న సమాచారం కూడా వినబడుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: