మరో షాకింగ్ డెసిషన్ తీసుకున్న సుమ.. ఇకపై అలా చేసే ఆలోచన లేదంటూ..?

Anilkumar
బుల్లితెరపై నెంబర్ వన్ ఫిమేల్ యాంకర్ ఎవరంటే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు సుమ కనకాల. సుమ ఏ ప్రోగ్రాం చేసిన అది సూపర్ హిట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే హీరోయిన్స్ రేంజ్ లో ఈమెకు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉంటారు. నెలకు 30 రోజులు ఉంటే అందులో దాదాపు 20 రోజులు పాటు ఆమె ఏదో ఒక షూటింగ్తో బిజీగానే ఉంటుంది. అయితే బుల్లి తెరపై నంబర్ వన్ యాంకర్ గా ఉంటూనే ఇటీవల ఆమె వెండితెరపై 'జయమ్మ పంచాయితీ' అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదల తర్వాత యాంకర్ సుమను జయమ్మ అని కూడా పిలవడం మొదలుపెట్టారు ఆడియన్స్.

అయితే ఆ సినిమా ఆమెకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సినిమా ఫలితం ఎలా ఉన్న సినిమాలో ఆమె పాత్రకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ఓ ప్రముఖ నిర్మాత ఒకరు తమ బ్యానర్ లో నటించాలని సుమను అడిగారట. కానీ సుమ మాత్రం అందుకు నో చెప్పినట్లు సమాచారం. నిజానికి వేరొకరు అయితే ఆ ఆఫర్ ని అస్సలు వదిలిపెట్టుకోరు. కానీ సుమ మాత్రం ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయడంతో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సుమ పూర్తిగా బుల్లితెరకే అంకితం అవ్వాలని డిసైడ్ అయిపోయిందట. నిజానికి ఇండస్ట్రీలో ఆమె కంటూ ఓ గుర్తింపు ఉంది. సినిమాలు చేసి దాన్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక తాజాగా వచ్చిన ఆఫర్ ను ఆమె రిజెక్ట్ చేసిందని చెబుతున్నారు.

ప్రస్తుతం వస్తున్న ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. ప్రస్తుతం యాంకర్ సుమకు ఎలాంటి డిమాండ్ ఉందో తెలిసిందే కదా. పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం వారి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి సుమ గారిని యాంకర్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. అందుకే తనకున్న గుర్తింపును నాశనం చేసుకోకూడదని సుమ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం సుమా కనకాల ఈటీవీలో వరుస టీవీ షోలో తో పాటు ఇతర చానల్స్ లో కూడా కనిపిస్తున్నారు. అలాగే అగ్ర హీరోల సినిమా రిలీజ్ ఫంక్షన్స్ లోనూ తనదైన యాంకరింగ్ తో అదరగొడుతున్నారు. ఒక సినిమా ఈవెంట్ ఫంక్షన్ కి సుమ తీసుకునే రెమ్యూనరేషన్ దాదాపు మూడు నుంచి నాలుగు లక్షల ఉంటుందట. ఈ రేంజ్ లో రెమ్యునేషన్ తీసుకునే మరోలేడీ యాంకర్ అయితే ఇప్పటివరకు తెలుగు బుల్లితెరపై లేకపోవడం గమనార్హం.. !!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: