బాలయ్య షోకి నాలుగు సార్లు పిలిచిన రాని స్టార్ హీరో.. ఎందుకో తెలుసా..?

Anilkumar
నటసింహ నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ అనే టాక్ షో ఆహాలో ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టాక్ షో తో హోస్ట్ గా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసారు బాలయ్య. ఇప్పటికే మొదటి సీజన్ ఎంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. త్వరలోనే రెండవ సీజన్ కూడా పూర్తి కాబోతుంది. ఇక ఈ రెండు సీజన్స్ లో వచ్చిన గెస్ట్ లతో బాలయ్య చేసిన సందడి అంతా కాదు. వారితో ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం రాబట్టి.. వాళ్లతో ఆడి పాడి తెగ హంగామా చేశాడు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు, రాజకీయ విశ్లేషకులు బాలయ్య టాక్ షో కి హాజరవ్వగా.. ఓ స్టార్ హీరో మాత్రం నాలుగు సార్లు ఇన్వైట్ చేసిన రాలేదట. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన మెగాస్టార్ చిరంజీవి. 

నిజానికి మొదటి సీజన్ ఫస్ట్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి రావాలి కానీ కొన్ని కారణాలవల్ల ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత మొదటి సీజన్లో ఏడవ ఎపిసోడ్ కైనా రావలసిందిగా అల్లు అరవింద్ చిరంజీవిని ఫోర్స్ చేశారట.అయినా ఇతర పనుల వల్ల చిరంజీవి రాలేదట. ఇక మొదటి సీజన్ పూర్తి అయిపోయింది. రెండో సీజన్ మొదలయ్యాక ఈ సీజన్ కైనా ఫస్ట్ గెస్ట్ గా రమ్మని బలవంతం చేశాడట అల్లు అరవింద్. అయినా గాని మన మెగాస్టార్ అంతగా ఆసక్తి చూపలేదట. కనీసం పవన్ కళ్యాణ్ వచ్చేటప్పుడు అయినా ఆ ఎపిసోడ్లో గెస్ట్ గా రమ్మంటూ కోరాడట. అయినా కూడా చిరంజీవి దాన్ని రిజెక్ట్ చేశారట. అలా నాలుగు సార్లు చిరంజీవి రిజెక్ట్ చేయడంతో ఈ విషయంలో అల్లు అరవింద్ చాలా హర్ట్ అయ్యాడట.

కానీ బాలయ్య మాత్రం ఆయన పరిస్థితి అర్థం చేసుకొని ఆయనకు సమయం ఉన్నప్పుడు కచ్చితంగా వస్తాడు.. మీరు మిగతా గెస్టులను ప్లాన్ చేయండి అంటూ చిరంజీవికి సపోర్ట్ గా మాట్లాడారట. అయితే తాను హోస్టుగా వ్యవహరించిన టాక్ షో కి చిరంజీవి నాలుగు సార్లు రిజెక్ట్ చేసినా బాలయ్య మాత్రం చిరు వైపే మాట్లాడటం గమనార్హం అయితే. త్వరలోనే సీజన్ 3 ని కూడా ప్లాన్ చేస్తున్నారు. అప్పుడైనా మెగాస్టార్ బాలయ్య షోకి వస్తారా? లేక మళ్ళీ హ్యాండ్ ఇస్తారా? అనేది చూడాలి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ సినిమాల విషయానికొస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. 'NBK108' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ హీరోయిన్గా నటిస్తున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: