తన సంపాదన ఎంతో బయటపెట్టిన థమన్..!?

Anilkumar
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో తమన్ కూడా ఒకరు. ప్రస్తుతం టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు గా కొనసాగుతున్న తమన్ మరియు దేవిశ్రీప్రసాదుల మధ్య ఎప్పుడూ పోటీ జరుగుతూనే ఉంటుంది. గత మూడేళ్లుగా దేవిశ్రీప్రసాద్ మీద తమన్ ది అప్పర్ హ్యాండ్ అయింది అనడంలో ఇలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురం సినిమా ఆల్బమ్తో ఈయన మంచి గుర్తింపును పొందాడు. దీంతో ప్రతి స్టార్ హీరో సినిమాకి మ్యూజిక్ ని అందించే ఛాన్స్ కొట్టేశాడు తమన్.ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం తమన్ ఎస్ఎస్ఎమ్ బి 28 ఆర్సి15 పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాలతో పాటు పలు ప్రాజెక్టుకి కూడా మ్యూజిక్ ని అందిస్తున్నాడు. 

థమన్ కి బాల్యం నుండి మ్యూజిక్ కంటే చాలా ఆసక్తి. అంతే కాదు ఒకప్పటి మణిశర్మ శిష్యుడు కావడం విశేషం. అంతేకాదు తమన్ తో పాటు దేవిశ్రీప్రసాద్ కూడా మణిశర్మ అసిస్టెంట్ గా చేయడం జరిగింది.2008  లో విడుదలైన మళ్లీమళ్లీ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్గా సినీ పరిశ్రమ లోకి ఎంట్రి ఇచ్చాడు తమన్. ఇక ఆయన మ్యూజిక్ కెరియర్ కి బ్రేక్ ఇచ్చిన సినిమా కిక్. ఆ సినిమాలో భిన్నమైన ట్యూన్స్ తమన్ ఇచ్చినప్పటికీ సంగీత ప్రియులను ఆ సినిమాలోని పాటలు అంతగా ఆకర్షించలేకపోయాయి.ఇదిలా ఉంటే ఇక తాజాగా మనకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.

అయితే తమన్ మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు లక్షల్లో సంపాదించేవాడని తెలుస్తోంది. 1999 నుండి 2000 లో తమన్ టాప్ కీబోర్డ్ ప్లేయర్ అన్నమాట. అప్పట్లో ఆయనకి రోజుకు 70 నుండి 80000 ఛార్జ్ చేసేవాడు. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అప్పట్లో తన సంపాదన ఈ రేంజ్ లో ఉండేదని ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చాడు తమన్. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్న తమన్ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఒక్కో సినిమాకి గాను కోట్లలో తీసుకుంటున్నాడు తమన్. చాలా చిన్న స్థాయి నుండి ఎదిగిన తమన్ ఒక సినిమా మ్యూజిక్ కి గాను ఎప్పుడు కోట్లల్లో చార్జ్ చేయడం విశేషంగా మారింది. దీంతో తనకి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: