ఆ సినిమా విషయంలో మహేష్ డైరెక్టర్ కి షాక్ ఇచ్చిన నాగచైతన్య..!?

Anilkumar
అక్కినేని నాగార్జున నట వారసులుగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు నాగచైతన్య మరియు అఖిల్. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అఖిల సురేందర్ రెడ్డి దర్శకత్వంలో స్పై యాక్షన్ డ్రామాగా ఏజెంట్ సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్ లో ఏకంగా ఐదు భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే వరుసగా రీ షూట్ల కారణంగా అఖిల్ నటిస్తున్న ఏజెంట్ సినిమా గత కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తుంది. 

ఇదిలా ఉంటే ఇక నాగచైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా సినిమా కస్టడీలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో ఏపీ కాలంలో ద్విభాషా చిత్రంగా నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో ఉప్పెన బ్యూటీ కృత్తి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తున్న ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. దీని అనంతరం నాగచైతన్య పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట సినిమాకు ముందే నాగచైతన్యకి పరుశురాం ఒక కథను వినిపించడం జరిగింది.

అంతేకాదు ఆ సినిమాకి నాగేశ్వరరావు అనే టైటిల్ ని కూడా అనుకున్నారట. ఆ క్రమంలోనే ఊహించిన విధంగా మహేష్ బాబు పిలవడంతో నాగచైతన్యతో చేయాల్సిన ప్రాజెక్టుని  పక్కనపెట్టి మహేష్ తో సర్కార్ వారి పాట సినిమా చేయడం జరిగింది.ఇక ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో నాగచైతన్య నాగేశ్వరరావు ప్రాజెక్టుని వదిలేసి కస్టడీ అని మరో కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఈ సినిమా తర్వాత పరశురాంతో  సినిమా చేయడానికి నాగచైతన్య సిద్ధంగా లేడు అని తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే పరుశురాంతో నాగచైతన్య సినిమా చేసే అవకాశాలు లేవని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: