అలాంటి పని చెయ్యమన్నారు.. అంటూ షాకింగ్ నిజాలు చెప్పిన ఎన్టీఆర్ హీరోయిన్..!?

Anilkumar
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ 2005లో నటించిన నరసింహుడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా నటించి టాలీవుడ్ కి పరిచయమైన ముంబై సోయగం సమీరా రెడ్డి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. జై చిరంజీవ, అశోక్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అనంతరం 2014లో అక్షయ్ వర్డనేని పెళ్లి చేసుకొని సినిమాలలో నటించడం మానేసింది.అనంతరం ఈమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈమె కొన్ని షాకింగ్ నిజాలని బయటపెట్టింది. పెళ్లయి ఇద్దరు పిల్లలతో చాలా సంతోషంగా ఉన్న ఈమె పదేళ్ల క్రితం తన సినీ కెరియర్ లో జరిగిన కొన్ని విషయాల గురించి చెప్పుకొచ్చింది. 

ప్రస్తుతం ఈమె ఎంతో మందికి తన వంతు సహాయ సహకారాలని అందిస్తుంది. సినిమాలకు దూరమైనప్పటికీ పలు అంశాలపై సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ ఉంటుంది.ఇటీవల రెండవ బిడ్డకి జన్మనిచ్చిన అనంతరం ఇప్పుడిప్పుడే తిరిగి సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతోంది సమీరా రెడ్డి. ఈ నేపథ్యంలోనే సమీరా మాట్లాడుతూ..ఆ రోజుల్లో హీరోయిన్ గా కొనసాగుతున్న టైం లో చాలామంది తనని బ్రెస్ట్ సర్జరీ చేయించుకోమని చెప్పారట. కానీ దాన్ని సమీరా ఏ మాత్రం పట్టించుకోలేదు. అప్పట్లో చాలామంది హీరోయిన్లు బ్రెస్ట్ సర్జరీలు చేయించుకునేవారు.అంతేకాదు అందంగా కనిపించడం కోసం ముక్కుకు సైతం ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకునేవారు.

అలా చాలామంది నన్ను కూడా అలాంటి సర్జరీలో చేయించుకోమని సలహా ఇచ్చారు. కానీ నేను మాత్రం ఆ పని చేయలేదు.అప్పట్లో చాలామంది డైరెక్టుగా నన్ను బ్రష్ సర్జరీ చేయించుకోమని చెప్పేవారు. అందుకు నేను.. నటి అయినందుకు ఖచ్చితంగా బ్రెస్ట్ సర్జరీ చేయించుకోవాలా.. అంటూ వారిని ప్రశ్నించే దాన్ని. ఎట్టి పరిస్థితుల్లో అలాంటి సర్జరీలు చేయించుకోవద్దని ఫిక్స్ అయ్యాను. అందరిలా నేను సర్జరీ చేయించుకోలేదు. అప్పుడు అలా చేయనందుకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. అప్పట్లో అది అందరి హీరోయిన్లకి చాలా అవసరం అని అనిపించింది. కానీ నాకు మాత్రం అనవసరం అని అనిపించింది. అందుకే నేను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రెస్ట్ సర్జరీని చేయించుకోలేదు. అంటూ పదేళ్ల క్రితం జరిగిన ఒక అనుభవాన్ని పంచుకుంది సమీరా రెడ్డి..!!.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: