మహేష్ కు కొత్త అలవాట్లు నేర్పిస్తున్న త్రివిక్రమ్ !

Seetha Sailaja
మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి నిర్మాణం జరుపుకుంటున్న మూవీపై అత్యంత భారీఅంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీని పాన్ ఇండియా మూవీగా కాకుండా కేవలం దక్షిణాది సినిమాగా నిర్మించాలని మొదట్లో అనుకున్నప్పటికీ ఈమూవీ కథ ఫైనల్ అయ్యేసరికి ఆకథ పాన్ ఇండియా మూవీగా బాగుంటుంది అన్న అంచనాలు రావడంతో త్రివిక్రమ్ మహేష్ ను ఒప్పించి ఈమూవీని పాన్ ఇండియా మూవీగా మార్చి ప్రస్తుతం షూట్ చేస్తున్నాడు.

హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో అత్యంత భారీ సెట్ వేసి నిర్మాణం జరుపుకుంటున్న ఈమూవీ షూటింగ్ లో ఇప్పటికే పూజా హెగ్డే మహేష్ తో జాయిన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చేవారం నుండి ఈమూవీ షెడ్యూల్ లో శ్రీలీల కూడ జాయిన్ అవుతున్నట్లు టాక్. ఈసినిమా కథ త్రివిక్రమ్ స్టైల్ లో ఉంటుందని లీకులు వస్తున్నాయి. ఈసినిమా ప్రాజెక్ట్ ను బ్లాక్ బష్టర్ హిట్ చేసి తీరాలి అన్నపట్టుదల త్రివిక్రమ్ కు ఏర్పడటంతో దానికోసం త్రివిక్రమ్ మహేష్ కు కొత్త అలవాట్లను నేర్పిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మహేష్ ఇండస్ట్రీలోకి వచ్చి రెండు దశాబ్దాలు పూర్తి అవుతున్నప్పటికీ అతడి లుక్ లో అదేవిధంగా అతడి బాడీ లాంగ్వేజ్ లోకాని మార్పులు చేయడానికి ఏదర్శకుడు ఇప్పటివరకు సాహసించలేదు. అయితే మహేష్ విషయంలో త్రివిక్రమ్ ఒక సాహసానికి శ్రీకారం చుడుతున్నట్లు టాక్. ఇప్పటివరకు ఏసినిమాలోను కనపడునట్లుగా మహేష్ లుక్ అదేవిధంగా హెయిర్ స్టైల్ బాడీ లాంగ్వేజ్ లో త్రివిక్రమ్ చాల మార్పులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

రజనీకాంత్ సినిమాలలో కనిపించే విధంగా ఒక స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ని మహేష్ కోసం త్రివిక్రమ్ చాల ఆలోచించి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ బాడీ లాంగ్వేజ్ రూపకల్పన కోసం ముంబాయ్ లోని ఒక ప్రముఖ బాడీ లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్ తో త్రివిక్రమ్ చాల లోతుగా చర్చలు జరిపి కొన్ని డ్రాయింగ్ లు కూడ వేయించి ఆతరువాత వాటన్నింటి పై మహేష్ అభిప్రాయాలను తీసుకుని ఈ స్పెషల్ బాడీ లాంగ్వేజ్ ని మహేష్ కోసం త్రివిక్రమ్ చాల శ్రద్ధపెట్టి డిజైన్ చేయించినట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: