రెండో పెళ్లి కి రెడీ అయిన 7\జి బృందావన్ కాలనీ హీరోయిన్..!?

Anilkumar
7/జి బృందావన్ కాలనీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమాను అంత త్వరగా ఎవరో మర్చిపోలేరు. ఈ సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అలాంటిది మరి. ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. మొదట ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ సినిమాపై చాలా నెగిటివ్ టాక్ వచ్చింది. దాని అనంతరం నెమ్మదిగా హిట్ టాక్నో అందుకుంది ఈ సినిమా. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన సోనియా అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో ఈమె గుర్రకారుల క్రష్ అని చెప్పొచ్చు. తన అందానికి గురకారులంతా ఏ రేంజ్ లో ఫిదా అయ్యేవారు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 

సోనియా తెలుగులోనే కాకుండా తమిళ భాషల్లో కూడా నటించింది. సెవెన్ బై జి బృందావన్ కాలనీ సినిమాలో నటించి తెలుగులో మంచి గుర్తింపును తెచ్చుకుంది. దాని అనంతరం రాఘవ దర్శకుడిని పెళ్లి చేసుకుంది ఈమె. దాని అనంతరం సినిమాలకు దూరమైంది. అయితే పెళ్లి తర్వాత అతను భర్తతో విభేదాలు రావడం కారణంగా ఆయననుండి దూరంగా ఉంటూ విడాకులు ఇచ్చింది సోనియా. విడాకుల అనంతరం సింగిల్గానే ఉంటుంది. అయితే తాజాగా ఈమెకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోనియా రెండు వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటీవలే ఈమె సెకండ్ ఇన్నింగ్స్ కూడా మొదలుపెట్టింది. ప్రస్తుతం ఏమే ఫాలో అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అయితే తాజాగా ఈమె రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అంటూ తెలియజేసింది.సరైన సమయం వస్తే కచ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. నన్ను రెండో పెళ్లి చేసుకునే వ్యక్తి కోసం ఎదురుచూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాదు సరైన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని..ఇంకెన్ని రోజులు పెళ్లి చేసుకోకుండా ఇలాంటి జీవితాన్ని గడుపుతాను నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చింది ఆమె. దీంతో ఈమె చేసిన వ్యాఖ్యలు కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: