వావ్: దసరా యూనిటీకీ కీర్తి సురేష్ బంగారు నాణేలు..!!

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీలో అచ్చ తెలుగు అమ్మాయిగా పేరుపొందింది హీరోయిన్ కీర్తి సురేష్. ముఖ్యంగా అలనాటి హీరోయిన్ సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన మహానటి సినిమా ద్వారా మరింత క్రేజ్ ను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తూనే స్టార్ హీరోల సినిమాలలో నటిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజీ ని సంపాదించుకుంది. చివరిగా మహేష్ బాబు తో కలిసి సర్కారు వారి పాట సినిమాలో గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకుంది.

ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో డి గ్లామర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ తరుణంలో కీర్తి సురేష్ ఈ సినిమాకు పని చేసిన కొంతమందికి రెండు గ్రాముల బంగారం కాయిన్స్ ని బహుమతిగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.ఈ విషయాన్ని సదరు చిత్ర బృందం సోషల్ మీడియాలో తెలియజేయడంతో అభిమానులు కీర్తి సురేష్ ని పొగడ్తలతో ముంచేస్తున్నారు. కీర్తి సురేష్ దాదాపుగా ఇందుకోసం రూ .15 లక్షల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సమాచారం.

ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ఈ చిత్రాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా అంతా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కించినట్లు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ పాటలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఇందులో కీలకమైన పాత్రలో ప్రకాష్ రాజ్, మీరాజాస్మిన్ సముద్రఖని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. వరుస ప్లాపులతో సతమతమవుతున్న నానికి దసరా సినిమా ఖచ్చితంగా కం బ్యాక్ ఇస్తుందని ఆయన అభిమానులు కూడా చాలా ధీమాతో ఉన్నారు. ఒకవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలలో నటిస్తూ మరొకవైపు కమర్షియల్ సినిమాలలో కూడా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: