“ఇలా తయారయ్యారేంట్రా..?”పర్మిషన్ లేకుండా వీడియో తీసిన వ్యక్తికి ఎన్టీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్....!
తాజా సమాచారం ప్రకారం, ఎన్టీఆర్ ఇటీవల ఒక స్టార్ హోటల్‌కు వెళ్లారు. అక్కడ ఆయన చాలా సింపుల్‌గా, వైట్ అండ్ వైట్ డ్రెస్సులో క్లాస్‌గా కనిపిస్తున్నారు. తారక్‌ను చూడగానే అక్కడున్న వారు ఎగ్జైట్ అవ్వడం సహజం. అయితే, ఒక వ్యక్తి మాత్రం అత్యుత్సాహం ప్రదర్శించాడు. తారక్ పర్మిషన్ లేకుండా, ఆయన వెంటపడుతూ మొబైల్‌లో వీడియో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు.ఎన్టీఆర్ ఆ వ్యక్తిని గమనించి, వద్దని వారించినా సరే.. ఆ ‘అతి’ అభిమాని వినకుండా కెమెరాను తారక్ మొఖం దగ్గరకు తీసుకెళ్లి వీడియో తీస్తూనే ఉన్నాడు. ఇది తారక్‌కు విపరీతమైన కోపాన్ని తెప్పించింది.
సెక్యూరిటీ సిబ్బంది ఆ వ్యక్తిని అడ్డుకుంటున్నా, అతను ఆగకపోవడంతో తారక్ ఒక్కసారిగా ఆగిపోయారు. నేరుగా ఆ వ్యక్తి కళ్లలోకి చూస్తూ, "పర్మిషన్ లేకుండా వీడియో తీయడం ఏంటి? ఇలా తయారయ్యారేంట్రా మీరు!" అంటూ గట్టిగా మందలించారు. తారక్ కళ్లలో ఆ రౌద్రాన్ని చూసిన ఆ వ్యక్తికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఆ గంభీరమైన వాయిస్ వినగానే అక్కడున్న వాళ్లంతా ఒక్క క్షణం నిశ్శబ్దమైపోయారు.సాధారణంగా ఎన్టీఆర్ అభిమానులతో చాలా సరదాగా ఉంటారు. కానీ, తన వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించినా, మర్యాద తప్పి ప్రవర్తించినా ఆయన అస్సలు సహించరు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవ్వడంతో రకరకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ వీడియోపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మెజారిటీ నెటిజన్లు ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. "స్టార్ హీరో అయితే మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదా? అలా వెంటబడి వీడియో తీయడం తప్పు" అని కొందరు కామెంట్ చేస్తున్నారు."తారక్ ఎప్పుడూ డిసిప్లిన్ ఉండాలని కోరుకుంటారు. ఆ వ్యక్తి అతి ప్రవర్తన వల్లే తారక్ సీరియస్ అయ్యారు" అని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు. "సింహం గర్జించింది.. అది సామాన్యమైన వ్యక్తి కాదు, యంగ్ టైగర్!" అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
తారక్ ఇలా సీరియస్ అవ్వడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో 'వార్ 2' ఈవెంట్‌లో తను మాట్లాడుతుంటే అరవద్దని, అలా అరిస్తే "నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను" అంటూ ఫ్యాన్స్‌కు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే లండన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రదర్శన సమయంలోనూ సెక్యూరిటీకి సహకరించాలని అభిమానులను మందలించారు. తారక్ ఎప్పుడూ చెప్పేది ఒక్కటే.. "అభిమానం ఉండాలి.. కానీ అది హద్దులు దాటకూడదు."ఎన్టీఆర్ తన అభిమానుల కోసం ప్రాణమిస్తారు. వారిని ‘తన తమ్ముళ్లు’ అని పిలుచుకుంటారు. కానీ, అభిమానం పేరుతో అసభ్యంగా ప్రవర్తించినా, పర్మిషన్ లేకుండా ప్రైవసీని దెబ్బతీసినా ఆయన ఊరుకోరు. ఈ తాజా ఘటనతో తారక్ తన స్టైల్ ఏంటో మరోసారి క్లియర్ గా చెప్పారు.