ఏపీ: వైసీపీ ఎమ్మెల్యేలపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సంచలన నిర్ణయం..!

Divya
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్నాయి. వైసిపి కొత్త వ్యూహాలను అమలు చేస్తూ ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసిపి ఎమ్మెల్యేలు ఎవరు కూడా అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు. అయితే కొంతమంది సభ్యులు సభకి వచ్చినట్లుగా సంతకాలు చేసి మరి సమావేశాలకు హాజరు కాకుండా బయట నుంచి తిరిగి వెళ్ళిపోతున్నారు. వైసిపి ఎమ్మెల్యేల తీరు పైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశమై చర్చించి మరి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన వైసిపి ఏం చేస్తుందనే విషయంపై ఇప్పుడు అందరు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.


2024 ఎన్నికలలో వైసిపి కేవలం 11 స్థానాలకే పరిమితమై అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 10% కూడా సీట్లు రాబట్టుకోలేక ప్రతిపక్ష హోదని దక్కించుకోలేకపోయింది. కానీ వైసీపీ మాత్రం సభలో మిగిలిన సభ్యులందరూ కూడా కూటమి సభ్యులు అవ్వడం వల్ల ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశం పైన హైకోర్టుకు కూడా వెళ్ళింది వైసిపి. అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణం చేసిన వేళ అలాగే గవర్నర్ ప్రసంగాల సమయంలో మాత్రమే వైసిపి ఎమ్మెల్యేలు సభకు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేలలో మాజీ సీఎం జగన్ తప్ప ప్రతి ఒక్కరు కూడా జీతం తీసుకుంటున్నారని స్పీకర్ కూడా ప్రకటించారు.



కొంతమంది సభకు హాజరుకాకుండానే హాజరైనట్టుగా సంతకాలు చేసి జీతాలు తీసుకోవడంతో శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టికి వచ్చిందని, అలాగే ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలు సామాజిక మధ్యమాలలో కూడా చాలా అసభ్యకరమైన పదాలు వాడడం వంటివి చేస్తున్నారని,ఎమ్మెల్యేల హాజరు పట్టికను పరిశీలించగా వైసిపి నుంచి 6 మంది ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు రావడం లేదంటూ కమిటీ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను ఇవ్వాలని అధికారులకు సూచించినట్లు సమాచారం. ఆ 6 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసు ఇచ్చి కమిటీ ముందు వివరణ ఇవ్వాలని , వారు ఇచ్చిన వివరణతో పాటుగా నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాత సభలో వారి గురించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. దీంతో వైసిపి ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ నుంచి వచ్చే నోటీసులకు సమాధానం చెప్పాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: