ది రాజాసాబ్ కు పరిస్థితులు కలిసొచ్చాయా.. మూవీ రికార్డులు క్రియేట్ చేయడం పక్కా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో రూపొందిన "ది రాజాసాబ్" చిత్రంపై ప్రస్తుతం చిత్ర పరిశ్రమలోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ వెండితెరపై హారర్ కామెడీ జోనర్‌లో కనిపించనుండటంతో ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటుందోనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.
ముఖ్యంగా నైజాం ఏరియాలో ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు సంబంధించిన అధికారిక జీవో కోసం చిత్ర యూనిట్ వేచి చూస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే, ఈరోజు మధ్యాహ్నం నుంచే బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపునకు అనుమతులు లభించడంతో, అక్కడ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి.
మరోవైపు, బాక్సాఫీస్ వద్ద "ది రాజాసాబ్"కు అనూహ్యంగా కలిసి వచ్చే అంశాలు కూడా తోడయ్యాయి. వాస్తవానికి ఇదే సమయంలో విడుదల కావాల్సిన "జన నాయగన్" సినిమా సెన్సార్ పరమైన చిక్కుల వల్ల వాయిదా పడటం ఈ చిత్రానికి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. పోటీలో ఇతర పెద్ద సినిమాలు లేకపోవడంతో "ది రాజాసాబ్"కు థియేటర్ల పరంగా భారీ అడ్వాంటేజ్ లభిస్తోంది.
"జన నాయగన్" కోసం ముందుగా కేటాయించిన స్క్రీన్లన్నింటినీ ఇప్పుడు "ది రాజాసాబ్"కే మళ్లించడంతో, సినిమాకు అత్యధిక స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. సోలో రిలీజ్ లాంటి వాతావరణం నెలకొనడం, థియేటర్ల కౌంట్ పెరగడం ప్రభాస్ సినిమాకు రికార్డు స్థాయి వసూళ్లను తెచ్చిపెడుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే మారుతి మార్క్ కామెడీ, ప్రభాస్ మేనరిజమ్స్ కలిసి బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి. రెండు రాష్ట్రాల్లో నియోజకవర్గాల వారీగా సమస్యలు, ఎమ్మెల్యేల పనితీరు, వారు ఇచ్చిన హామీలు, ప్రజల ఇబ్బందులు, అక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల పరిస్థితులు, రాజకీయ అంశాలపై కూడా మీ అభిప్రాయం మాతో పంచుకోండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.