మెగా బ్రదర్స్ పై సంచలన కామెంట్స్ చేసిన వర్మ..!?

Anilkumar
ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా రాంగోపాల్ వర్మ జనసేన పవన్ కళ్యాణ్ మరియు మెగా బ్రదర్ నాగబాబు ఎవరు ఊహించని విధంగా సెటైర్లు వేశారు. తాజాగా తన సోషల్ మీడియా వేదికగా ఆయన ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేశాడు రాంగోపాల్ వర్మ. అందులో భాగంగా ఈయన మాట్లాడుతూ.. కొణిదల నాగబాబు గారు అంటూ ఆయనపై మాటల తూటాలో సంధించారు. చిరంజీవి పవన్ కళ్యాణ్ కు నాగబాబు చాలా ఇష్టం కావచ్చు కానీ తనకు కాదు అని చెప్పుకొచ్చాడు వర్మ. అంతేకాదు తాను ఇప్పటివరకు జనసేనకి సంబంధించిన ట్వీట్లు ఒక అభిమానిగా చేసినవి మాత్రమే 

అంటూ చెప్పుకొచ్చారు.ఇక ఆ విషయం వారికి అర్థం కాకపోవడం తన దురదృష్టం అని తనకంటే ఎక్కువగా అది పవన్ కళ్యాణ్ కి దురదృష్టకరమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు నాగబాబు లాంటి సలహాదారులను పెట్టుకుంటే దాని ఫలితాన్ని ప్రజలు చెప్తారు అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు హలో పవన్ కళ్యాణ్ గారు మీ భాయిజాన్ గారిని చూసుకోండి అంటూ తన పోస్ట్ చేసిన వీడియో కింద ఒక క్యాప్షన్ కూడా రాశాడు వర్మ. గత కొంతకాలంగా టిడిపి అధినేత చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ పై ఎప్పుడు లేని విధంగా తనదైన శైలిలో విమర్శలను కురిపిస్తున్నాడు వర్మ. అంతేకాదు దీని అనంతరం పవన్ ప్రసంగాలపై కూడా అనేక సెటైర్లను వేశాడు వర్మ. 

అయితే తాజాగా సంక్రాంతి సందర్భంగా వర్మ గోదావరి జిల్లాలో పర్యటించడం జరిగింది. ఇందులో భాగంగానే ఒక మీడియాతో ముచ్చటించారు వర్మ. ఇక అందులో భాగంగానే అని మాట్లాడుతూ.. గోదావరి జిల్లాలో ఆయనకు చాలామంది తెలుసు అని..సంక్రాంతి సందర్భంగా తన స్నేహితులందరూ తనను అక్కడికి పిలిచారు అని ..ఈ సందర్భంగా నాగబాబు వ్యాఖ్యలపై స్పందించాలని కోరగా తన గురించి ఆయన మాట్లాడుతూ.. నాగబాబు నా గురించి ఏం మాట్లాడారో తెలియదు కానీ.. దాని గురించి ఇప్పటిదాకా నేను వినలేదు.. అంటూ చెప్పుకొచ్చాడు వర్మ .నేను ఆయన మాటలు విన్న తర్వాత కచ్చితంగా స్పందిస్తాను.. అంటూ చెప్పవచ్చాడు ఇందులో భాగంగానే తాజాగా ఒక వీడియోని కూడా షేర్ చేశాడు వర్మ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: