పవన్ కాంటాక్ట్ ని చిరంజీవి ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా..!?

Anilkumar
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా మరికొద్ది గంటల్లో విడుదల కానుంది. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహారాజ రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా తాజాగా సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న సుమ అడ్డా ప్రోగ్రాం కి వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమాకి సంబంధించిన అనేక రకాల విషయాలను చెప్పుకొచ్చాడు.సినిమా విషయాలు కాకుండా తన వ్యక్తిగత విషయాల గురించి కూడా షేర్ చేసుకున్నాడు చిరంజీవి. 

అయితే ఇందులో భాగంగానే సుమ చిరంజీవిని మీ ఫోన్లో ఎవరెవరి నంబర్స్ ఎలా సేవ్ చేసుకున్నారో చెప్పండి అంటూ కొందరి పేర్లను అడగడం జరిగింది...సురేఖ కాంటాక్ట్ ఏమని సేవ్ చేసుకున్నారు అని అడుగగా  "రే"అని చేసుకున్నాను అంటూ బదిలీస్తాడు చిరంజీవి..  అనంతరం రామ్ చరణ్ నంబర్ ఏమని సేవ్ చేసుకున్నారు అని సుమా అడుగుతుంది... ఆ ప్రశ్నకి వదిలేస్తూ మీ హాస్టల్ చిరంజీవి చెర్రీ అని సేవ్ చేసుకున్నాను అంటూ చెబుతాడు.. ఆఖరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ ని ఏమని సేవ్ చేసుకున్నారు అని సుమా చిరంజీవిని అడుగుతుంది... ఇక దానికి సమాధానంగా చిరంజీవి మాట్లాడుతూ..

కళ్యాణ్ బాబు అని సేవ్ చేసుకున్నాను అంటూ చెప్తాడు. దీంతో ఒక్కసారిగా షో లో ఉన్న అభిమానులు అంతా గట్టిగా అరుస్తూ పవన్ కళ్యాణ్ నినాదాలను చేస్తారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ కాంటాక్ట్ ని ఏమని చేసుకున్నాడు అన్న విషయం కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.  సినిమాలే కాకుండా ప్రస్తుతం రాజకీయాలలో కూడా బిజీగా ఉన్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి కూడా రావడం జరిగింది. ఇక ఆయన గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ అభిమానులు చూస్తున్నారు ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: