త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతున్న మంచు మనోజ్..!?

Anilkumar
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ప్రస్తుతం ఈయన గత ఐదు సంవత్సరాలు నుండి సినిమాలకు దూరంగా ఉన్నాడు. మంచు  మనోజ్ ఒక్కడు మిగిలాడు అన్న సినిమాతో సినిమాలకు దూరమయ్యాడు. అయితే గతంలో అహం బ్రహ్మాస్త్రి అనే సినిమా ప్రారంభించి షూటింగ్ కూడా మొదలుపెట్టారు.కానీ ఎవరూ ఊహించిన విధంగా ఆ ప్రాజెక్ట్ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.అయితే ఇదంతా పక్కన పెడితే 2019లో తన భార్యతో కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల విడిపోయాడు మనోజ్. 

ఆమెతో విడాకులు తీసుకుని నిత్యం ఏదో ఒక వార్తలో నిలిచాడు మనోజ్. దాని అనంతరం మంచు మనోజ్ మళ్లీ రెండవ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా కడప దర్గాలో కొన్ని ప్రత్యేక పూజలు నిర్వహించాడు మంచు మనో జ్.ఇందులో భాగంగానే మంచు మనోజ్ త్వరలోనే తన సరికొత్త జీవితాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించాడు. కొత్త జీవితంతో పాటు మరికొత్త సినిమాలు కూడా ప్రారంభిస్తాను అని చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో రెండవ పెళ్లి పై వస్తున్న రూమర్లు మరి కాస్త ఎక్కువ అయ్యాయి.

అయితే రాజకీయపరంగా మంచి పేరు తెచ్చుకున్న భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక తో మంచు మనోజ్ గత కొంతకాలంగా చాలా సన్నిహితంగా ఉంటున్నారు అన్న వార్తలు వస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అన్న వార్తలు సైతం వినిపిస్తున్నాయి. త్వరలోనే ఇరువురు కుటుంబాల అంగీకారంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతారని తెలుస్తోంది. ఇందుకుగాను ఈ వార్తలు పై క్లారిటీ ఇచ్చాడు మంచు మనోజ్. ఇందులో భాగంగానే కడప దర్గాలో మంచు మనోజ్ తన పెళ్లి వార్త నిజమేనని మౌనికతో త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాను అని చెప్పినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రానుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: