నాని భార్య అంజన ఏం చేస్తారో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్ నాని గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నాని. అయితే సాధారణంగా నానిని చూస్తే ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి రావాలి అని అనుకునేవారికి ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. అయితే మొదట రేడియో జాకీగా అతను కెరియర్ ను మొదలుపెట్టిన నాని దాని అనంతరం సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాలకు క్లాప్ కొట్టడం జరిగింది. దాని అనంతరం హీరోగా తన టాలెంట్ను బయటపెట్టాడు నాని. చిన్నచిన్న పాత్రలు.. సినిమాలో చేస్తూనే తనకంటూ స్టార్ హీరోగా ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. 

ప్రస్తుతం నాని స్టార్ హీరో గానే కాకుండా నిర్మాతగా కూడా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా హిట్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో విశ్వక్సేన్ హీరోగా నటించిన హిట్ సినిమా విజయం అనంతరం అడవి శేషు హీరోగా నటించిన హిట్టా 2 సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు హిట్ 3 లో నాని హీరోగా కనిపించబోతున్నాడు. అయితే ఈ 3  సినిమాలకి కూడా ఆయనే నిర్మాత. అయితే చాలామందికి నేచురల్ స్టార్ నాని గురించి తెలిసే ఉంటుంది. కానీ ఆయన భార్య గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.

ఇక నాని భార్య పేరు అంజన. ఈమె టాలెంట్ చూస్తే ఖచ్చితంగా అందరూ ఆశ్చర్యపోతారు. నాని భార్య అంజన ఒక ఫ్యాషన్ డిజైనర్ అయితే ఈమె ఫ్యాషన్ డిజైనింగ్ చేయడమే కాకుండా మణిపాల్ యూనివర్సిటీ నుండి కార్పొరేట్ కమ్యూనిటీలో పీజీ కూడా పూర్తి చేసింది అంజన. అయితే ప్రస్తుతం ఈమె ఆర్క మీడియా క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తుంది. అయితే గతంలో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో నటించిన ప్రభాస్ ,అనుష్క , రానా అలాగే ఇతరులకు కాస్ట్యూమ్స్ ని రమా రాజమౌళితో కలిసి రూపొందించింది అంజన.ఇక ఈ విషయం తెలిసి నాచురల్ స్టార్ అభిమానులు అంజన టాలెంట్ ని చూసి ముచ్చట పడుతున్నారు. ఇదిలా ఉంటే ఇక నాని తన భార్య అంజనను అంజు అని పిలుస్తారు. అయితే వీరిద్దరూ కూడా సోషల్ మీడియాకు ఎప్పటికీ దూరంగా ఉండాలి అని భావిస్తున్నారు. అందుకే నాని కూడా తన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా కనిపించడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: