ఆ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న వెంకటేష్..!?

Anilkumar
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వెంకటేష్ మల్టీస్టారర్ సినిమాలతోనే మంచి గుర్తింపు పొందాలి అన్న ప్రయత్నం చేస్తున్నాడు. వెంకటేష్ సోలో హీరోగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకొని చాలా కాలం అయింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ప్రస్తుతం వెంకటేష్ రీమిక్స్ సినిమాలు ఎక్కువగా చేస్తున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం వెంకటేష్ మంచి  సినిమాలో చేయాలని కొత్త కథలో కనిపించాలి అని చూస్తున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన లిస్టులో చాలామందికి దర్శకులు ఉన్నారు. చాలామంది దర్శకులను వెంకటేష్ అనుకున్నప్పటికీ ఎవరితో సినిమా చేయాలి అని మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. 

గతంలో ఈ నగరానికి ఏమైంది దర్శకుడు తరుణ్ భాస్కర్ తో పాటు నేను శైలజ దర్శకుడు కిషోర్ తిరుమల తో ఒక సినిమా చేయాలని అనుకున్నాడు వెంకటేష్. కానీ కొంతకాలం తర్వాత ఆ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో వెంకటేష్ వెనుకడుగు వేశాడు. దాని అనంతరం జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ తో కూడా వెంకటేష్ ఒక సినిమా చేయాలని అనుకున్నాడని గతంలో అనేక రకాల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్ తాజాగా ధమాకా సినిమాతో సక్సెస్  అందుకున్న దర్శకుడు త్రినాధ రావుతో ఒక సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడట వెంకటేష్. ఇక ధమాకా సినిమా విడుదలై 100 కోట్లకు పైగాని కలెక్షన్స్ను రాబట్టింది.

 ఇక మాస్ మహారాజ రవితేజ కెరియర్ లోనే కాకుండా దర్శకుడు త్రినాధరావు కెరియర్ లో కూడా ఇది భారీ స్థాయిలో కలెక్షన్స్ను అందుకున్న సినిమాగా నిలిచింది. ప్రస్తుతం బడా సంస్థలు సైతం త్రినాధ రావుతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ముఖ్యంగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ త్రినాధ రావు కి అడ్వాన్స్ సైతం ఇచ్చి ఆయన నెక్స్ట్ సినిమాని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లోని చేయాలి అని అగ్రిమెంట్ సైతం కుదిరించుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే తాజాగా దర్శకుడు త్రినాధరావు వెంకటేష్ కి ఒక స్టోరీ లైన్ ను చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అందులో మంచి ఎంటర్టైన్మెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా భారీగా ఉంటాయని అందుకే ఆ కథని వెంకటేష్ కి వినిపించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఇద్దరు కాంబినేషన్ గనక సెట్ అయితే ఈ సినిమా కూడా మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం ఖాయం. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడూ తెరపైకి తీసుకువస్తారో చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: