ఎన్టీఆర్ ని కాదని ఆ స్టార్ హీరో సినిమా కి ఒకే చెప్పిన జాన్వీ.. !?

Anilkumar
సాధారణంగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తాతల పేర్లు నాన్నల  పేర్లు చెప్పుకొని ఎంట్రీ ఇచ్చిన హీరోలు హీరోయిన్లు చాలామంది ఉన్నారు. రాను రాను మరో జనరేషన్ కూడా వారి పేరు చెప్పుకొని సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలోనే అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా ఈమెకి సంబంధించిన పలు రకాల వార్తలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. అతిలోక సుందరి శ్రీదేవి కూతురుగా మంచి పేరు తెచ్చుకున్న ఈమె బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అందరిని మెప్పించింది.

సినిమాల్లోనే కాకుండా తన సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఎక్స్పోజింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈమె సినిమాలో కంటెంట్ ఉంటేనే ఆ సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటుంది. అయితే బాలీవుడ్ కి పరిమితమైన ఈమె టాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా జాన్వి కపూర్ ఎన్టీఆర్ 30 సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇందులో ఎలాంటి నిజం లేదు అంటూ తేల్చి చెప్పాడు బోనికపూర్. ఇందులో భాగంగానే తన నెక్స్ట్ సినిమా తో రామ్ చరణ్ సినిమాలో హీరోయిన్ గా ఈమె ఫిక్స్ అయింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ ఇప్పుడు మాత్రం రామ్ చరణ్ తో సినిమా చేసే కంటే ముందే మరో స్టార్ హీరోతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతుందట జాన్వి కపూర్.అయితే తాను ఎంతో ఇష్టపడే విజయ్ దేవరకొండ తో టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుందట ఈమె. విజయ్ దేవరకొండ ప్రస్తుతం సమంత హీరోయిన్ గా నటిస్తున్న కృషి సినిమాలో నటిస్తున్నాడు. ఇక సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమా షూటింగ్ కాస్త మిగిలిపోయింది. మరో రెండు నెలల్లో ఆ షూటింగ్ని పూర్తి చేసి వెంటనే మరో సినిమాని చేసేందుకు రెడీ అయ్యాడు విజయ్ దేవరకొండ. ఇక ఆ సినిమాలో హీరోయిన్ గా జాహ్నవి కపూర్ ని తీసుకోవడానికి విజయ్ దేవరకొండ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక జాన్వి కూడా విజయ్ దేవరకొండ తో నటించడానికి ఓకే చెప్పినట్లుగా సమాచారం..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: