బిగ్ బాస్ సీజన్ 7 హౌస్ లోకి వెళ్లబోయేది వీళ్ళే..!?

Anilkumar
బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రసారమయ్యే బిగ్ బాస్ షో చూడని వారు అంటూ ఉండరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ఈ షో తెలుగులో 6 సీజన్లను పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు ఏడవ సీజన్ కు రెడీ అవుతుంది. అయితే ఈ ఏడాది జూన్ నుండి స్టార్ మా లో ఈ షో ప్రసారం కానుంది. ఇందుకుగాను ఇప్పటినుండే ఈ షో కి కంటెంట్లను సెలెక్ట్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం. అయితే ఈ క్రమంలోని బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి కొంత మందిని సెలెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సీజన్ సెవెన్ కి ఎవరు సెలెక్ట్ అయ్యారో ఇప్పుడు తెలుసుకున్నాం... 

అయితే గత కొంతకాలంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ కి పోస్ట్ గా నాగార్జున చేయడం లేదని నాగార్జున ప్లేస్ లో రానా ఈ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో భాగంగానే తాజాగా సీజన్ సెవెన్ కి కొంత మంది కంటెస్టెంట్లను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ లిస్టులో ముందుగా సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన దుర్గారావు ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే టిక్ టాక్ ద్వారా మంచి పాపులారిటీని అందుకున్న ఈయన ప్రస్తుతం జబర్దస్త్ షోలో కూడా చేస్తున్నాడు. ఇక ఈ షో ద్వారా ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

ఈ క్రమంలో ఆయన ఫ్యాన్ ఫాలింగ్ పెరిగిపోవడంతో బిగ్బాస్ సీజన్ సెవెన్ కి ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే ఈయనతో పాటు మరో పేరు కూడా వినిపిస్తుంది. అది ఎవరో కాదు టిక్ టాక్ ద్వారా బాగా గుర్తింపు పొంది దాని అనంతరం యాంకర్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన దీపిక పిల్లి. ప్రస్తుతం ఈమె యాంకర్ గానే కాకుండా హీరోయిన్గా కూడా పలు సినిమాల్లో నటించింది. వీరిద్దరితో పాటు నయని పావని, మరియు జబర్దస్త్ వర్ష, జబర్దస్త్ పవిత్ర, వైష్ణవి చైతన్య కూడా బిగ్ బాస్ సెవెన్ కి ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. అయితే బుల్లితెరపై వీరందరూ కూడా తమ అందచందాలతో పలు షోలలో నటిస్తూ అలరిస్తున్నారు. ఇక వీరందరూ బిగ్ బాస్ కి నిజంగా ఫైనల్ అయ్యారా లేదా అన్నది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: