అవతార్ 2 రికార్డులను బీట్ చేసిన వారిసు..!?

Anilkumar
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ హీరోగా నటించిన వారసుడు సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని విడుదల చేశారు. ట్రైలర్ విడుదలైన కొద్దిసేపటికి ట్రైలర్ గురించి మీన్స్ మరియు ట్రోల్స్ చేస్తున్నారు చాలామంది. ఇందులో భాగంగానే ఈ సినిమా ట్రైలర్ గౌతమ్ ఎస్ఎస్ సి లా ఉంది అని.. అలా వైకుంఠపురంలో సినిమా లాగా ఉందని.. మరికొందరు మహర్షి మరియు అజ్ఞాతవాసి సినిమాల లాగానే ఈ ట్రైలర్ ఉంది అని అంటున్నారు. అన్ని సినిమాలను కలిపి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారేమో అంటూ చాలామంది ట్రోల్స్ చేస్తున్నారు. 

అయితే ఒకవైపు నెగిటివ్ ట్రోల్స్ ను ఎదుర్కొంటూనే మరోవైపు రికార్డులను క్రియేట్ చేస్తుంది దళపతి వారసుడు సినిమా. అయితే తమిళంలో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ 24 గంటల్లో ఏకంగా 21 మిలియన్ అందుకుంది. రిలీజ్ అయిన రెండు గంటల్లోనే అవతార్ 2 ట్రైలర్ రేంజ్ లో దూసుకుపోతుంది ఈ సినిమా ట్రైలర్.అయితే అవతార్ 2 ట్రైలర్ 50 మిలియన్ లైక్ లను క్రాస్ చేసింది. ఇన్ని మిలియన్ల వ్యూస్ దక్కించుకున్నప్పటికీ ఒక్క మిలియన్ లైకులని మాత్రమే దక్కించుకుంది. ఇక ఆ రికార్డుని బ్రేక్ చేశాడు విజయ్. 24 గంటల్లోనే ఏకంగా 1.7 మిలియన్ లైకులని అందుకుంది ఈ ట్రైలర్.

ట్రైలర్ నుండి వివాదాలను ఎదుర్కొంటుంది విజయ్ సినిమా. అయితే ఈ సినిమాకి గాను దిల్ రాజు పలు కామెంట్లను చేయడం జరిగింది. దీంతో ట్రైలర్ విడుదల అయిన అనంతరం చాలామంది ఈమాత్రం సినిమాకి ఇంత హడావిడి అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్లను పెడుతున్నారు చాలామంది నటిజెన్లు. ఏదేమైనప్పటికీ విజయ్ సినిమా మంచి బజ్ ను క్రియేట్ చేసుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అవతార్ లాంటి సినిమా ట్రైలర్  రికార్డును కూడా ఈ సినిమా బ్రేక్ చేయడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: