అతని వల్లే నేను అలా మారిపోయాను.. శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్..??

Anilkumar
సాధారణంగా  హీరోల వారసులుగా  సినీ ఇండస్ట్రీ లో కిఎంట్రీ  ఇస్తూ ఉంటారు. ఇక అలా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో విశ్వ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ వరుస సినిమాలు చేసే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది.  ఎన్నో సినిమాలలో నటించి ఇప్పుడు స్టార్ హీరోయిన్గా చలామణి అవుతుంది. అయితే శృతిహాసన్ కి ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి మాత్రం చేసుకోలేదు. ఇటీవల శృతిహాసన్ డూడల్ ఆర్టిస్ట్ శాంతనుతో తను ప్రేమలో ఉన్నాను అంటూ ఏకంగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించిన సంగతే మనందరికీ తెలిసిందే. 

ఇక వారిద్దరికీ సంబంధించిన ప్రతి ఫోటోను తన సోషల్ మీడియా వేదిక ద్వారా ఎప్పటికప్పుడు తన అభిమానులతో పెంచుకుంటూనే ఉంటుంది శృతిహాసన్. ఆయనతో ఎంతో క్లోజ్ గా ఉన్న ఫోటోలను సైతం తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంటుంది శృతిహాసన్. సాధారణంగా ఏ సినీ సెలబ్రిటీ అయినా సరే తమ ప్రేమ వ్యవహారాలను సీక్రెట్ గా ఉంచుతారు బయట పెట్టడానికి ఇష్టపడరు కానీ శృతిహాసన్ మాత్రం అలా కాదు ఎవరూ ఊహించని విధంగా ఆయనతో ఫోటో దిగి గతంలో తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూసిన చాలామంది ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.  ఆయన వల్ల శృతిహాసన్ లో వచ్చిన కొన్ని మార్పుల గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది శృతిహాసన్. ఇక ఇంటర్వ్యూలో భాగంగా శృతిహాసన్ మాట్లాడుతూ నేను శాంతను బెస్ట్ ఫ్రెండ్స్ అని ఇద్దరం కలిసి ఉంటామని సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసే ఫోటోలకు గాను వచ్చే కామెంట్స్ మేమిద్దరం కలిసే చదువుతాము అని ఎందుకు అంటే ఆ కామెంట్స్ చాలా కామెడీగా ఉంటాయని నేను ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నాను అంటే దానికి కారణం శాంతనూనె అని ఆయన చాలా దయగలవాడు అని అందుకే శాంతను అంటే నాకు చాలా ఇష్టమని శృతిహాసన్ చెప్పుకొచ్చింది. అంతే కాదు ఈ రెండు అలవాట్లను ఆయన దగ్గర నుండి నేను నేర్చుకున్నానని ఆ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పొచ్చింది శృతిహాసన్ .ప్రస్తుతం వాల్తేరు వీరయ్య మరియు వీరసింహారెడ్డి సినిమాలలో నటించింది.ఇక ఈ రెండు సినిమాల్లో సంక్రాంతికి గాను విడుదల కానున్నాయి. దీంతో శృతిహాసన్ చేసిన కామెంట్లు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: