ఆ తేదీన "వాల్తేరు వీరయ్య" ట్రైలర్ విడుదల..?

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే చిరంజీవి ఈ సంవత్సరం కొరటాల శివ దర్శకత్వంలో తేరకెక్కిన ఆచార్య ... మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు . ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య అనే పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీbలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బాబీ సింహ ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూ ఉండగా ,  మాస్ మహారాజా రవితేజ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే రవితేజ కు సంబంధించిన టైటిల్ టీజర్ ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. దీనికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

ఈ సినిమాని వచ్చే సంవత్సరం జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు. దీనితో వాల్తేరు వీరయ్య మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ విడుదల కు సంబంధించిన సన్నాహాలను చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ట్రైలర్ ను జనవరి 4 వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం మరికొన్ని రోజుల్లోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: