మహేష్ బాబు ఒక్కడు సినిమా మిస్ చేసుకున్న స్టార్ హీరో..!?

Anilkumar
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒక హీరో కోసం అనుకున్న కథను మరొక హీరో చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కొన్ని కథలు కొందరు హీరోలకే సెట్ అవుతాయని ఆ పర్టికులర్ హీరోతోనే సినిమా చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. అంతేకాదు ఒక హీరో కోసం అనుకున్న కథ మరొక హీరో దగ్గరికి వెళ్లి ఆ హీరో ఆ సినిమాలో నటించిన అనంతరం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ఇలా జరిగినప్పటికీ ప్రతిసారి ఇలా జరగదు. అలా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాని వదులుకున్నామే అని చాలామంది స్టార్ హీరోలు బాధపడ్డా సందర్భాలు కూడా ఉన్నాయి. 

ఇక అలాంటి వార్త ఇప్పుడు ఒకటి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సినిమా ఇప్పుడు టీవీలో వచ్చిన కూడా ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు .ఈ సినిమా విడుదలైనప్పుడు సినిమాలోని చార్మినార్ సెట్ కోసం భారీగా ఖర్చు కూడా చేశారు అనే వార్తలు అప్పుడు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమాలో విలన్ గా ప్రకాష్ రాజ్ ఎంతటి ఆదరణ పొందాడో మనందరికీ తెలుసు.

ఇక ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడిగా భూమిక హీరోయిన్గా నటించిన గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ కలెక్షన్స్ కూడా అందుకుంది. దాని అనంతరం అర్జున్ సినిమా కూడా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇక అసలు విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ఒక్కడు సినిమా మొదటగా పాన్  ఇండియా స్టార్ హీరో అయిన ప్రభాస్ దగ్గరకు వెళ్లిందట. ఇక మొదటగా ఈ కథను కృష్ణంరాజుకి వినిపించగా ఆయనకు కూడా కథ నచ్చి ఓకే చేశారట. ఇక ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో ఈ సినిమాలో కొన్ని మార్పులు చేయమని ప్రభాస్ చెప్పాడట.  అలా చేస్తే సినిమా బాగుండదని ఫ్లాప్ అయ్యే అవకాశాలు ఉంటాయని ప్రభాస్ తో కాకుండా మహేష్ బాబుతో చేయాలని భావించారట. ఇక అలా మహేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా కన్నడ మలయాళం హిందీ భాషల్లో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా  నిలిచింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: