సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టడం వెనుక ఇంత రహస్యం ఉందా..?

Divya
తెలుగు సినీ ఇండస్ట్రీ కి  పేరు ప్రఖ్యాతలు రావడంలో  సీనియర్ ఎన్టీఆర్ కృషి  ఉందని చెప్పవచ్చు. ఎన్నో వైవిద్యమైన సినిమాలతో పాటు వైవిధ్యమైన పాత్రలలో నటించి మంచి పేరు సంపాదించారు.దివంగత నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించడం వెనుక ఎప్పుడు ఎన్నో కథలు ప్రచారంలోకి వస్తూనే ఉంటాయి. అయితే గతంలో ఒక ఇంటర్వ్యూలో కైకాల సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ పెట్టడం వెనుక ఉన్న షాకింగ్ విషయాలను వెల్లడించారు.. గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ఎన్టీఆర్ గారి దగ్గర నాకు చాలా ఫ్రీడం ఉండేది. ఆయన చనిపోయే వరకు ఆయనతో మంచి అనుబంధము కొనసాగింది. ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఆయన మా ఇంటికి వచ్చేవారు. ప్రజల రుణం తీర్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతోనే తెలుగుదేశం పార్టీ పెట్టారని.. ఎన్టీఆర్ తనతో చెప్పారు అని కైకాల తెలిపారు.

జాతకం ప్రకారం 60 సంవత్సరాల తర్వాత లైన్ మార్చేయాలని ఉందని.. అందుకే ఆయన రాజకీయరంగం వైపు అడుగులు వేశారని కైకాల సత్యనారాయణ ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొంతమంది సీనియర్ ఎన్టీఆర్ కి రాజకీయాలకు వెళ్లాలని సలహా ఇచ్చారు అని.. సరోజినీ పుల్లారెడ్డి గారు సీనియర్ ఎన్టీఆర్.. రెండు గంటలు ఎదురుచూసినా ఆయనను కలవకుండా అవమానించారని..ఆ తర్వాత వెంకట్రాం రెడ్డి గారు కూడా సీనియర్ ఎన్టీఆర్ ను ఒక సందర్భంలో లోపలికి రానివ్వలేదని.. ఆ అవమానాల వల్లే సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని కైకాల తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎన్నో సంచలనాలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ప్రజలకు ఎంతగానో ప్రయోజనం చేకూర్చాయి.  సీనియర్ ఎన్టీఆర్ పథకాలు ఈ జనరేషన్ ప్రజల్లో కూడా మంచి పథకాలుగా పేరు తెచ్చుకున్నాయి.  భౌతికంగా ఆయన మన దగ్గర లేకపోయినా ప్రజల హృదయాలలో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: