త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రదీప్..పెళ్లి కూతురు ఎవరో తెలుసా..!?

Anilkumar
బుల్లితెర యాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ గా పేరు పొందిన ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. చిన్నతరపై తనకంటూ ప్రతిభ గుర్తింపును సంపాదించుకున్నాడు ఈ యంగ్ యాంకర్.చాలామందికి ప్రదీప్ కామెడీ టైమింగ్ అంటే చాలా ఇష్టం ఆయనకి ఉన్న క్రేజ్ తో 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా సైతం ఈయన నటించిన జరిగింది. అయితే గత కొంతకాలంగా యాంకర్ ప్రదీప్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ మధ్యన పొలిటికల్ లీడర్ కూతురితో ఆయన వివాహం జరగబోతుంది

 అనే వార్తలు సైతం వచ్చాయి. గతంలో కూడా అతని పెళ్లిపై రకరకాల రూమర్లు వచ్చాయి. అయితే ఈసారి నిజంగానే ప్రదీప్ మాచిరాజు పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తోంది. అయితే ఆయన ఒక ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ నవ్య తో వివాహం చేసుకోబోతున్నాడని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నయి. ప్రదీప్ నవ్య చాలా రోజులుగా రిలేషన్షిప్లో ఉన్నారని ఎట్టకేలకు వీరి బంధాన్ని ఇంట్లో వారు అంగీకరించారని ఇప్పటికే ఇద్దరు వివాహం గురించి ఇరువురు తమ కుటుంబాలతో చర్చించి ఒకే చెప్పినట్లుగా తెలుస్తుంది. ఇరువురి మతాలు వేరైనప్పటికీ వీరిద్దరి కుటుంబాలు వీరి పెళ్ళికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రదీప్ ని పెళ్లి గురించి అడగడం జరిగింది. దీనికిగాను బుల్లితెర యాంకర్లలో నెంబర్ వన్ యాంకర్ గా పేరు పొందిన ప్రదీప్ మాచిరాజు ని మీకు ప్రేమ వివాహం చేసుకోవాలని ఉందా లేదంటే పెద్దలు కుదిరించిన వివాహం చేసుకోవాలని ఉందా అని అడగగా తనకు లవ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉంది అంటూ చెప్పుకొచ్చాడు ప్రదీప్. అంతేకాదు ఆయనకి వావ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ ఎందుకు ఇష్టమో కూడా చెప్పుకొచ్చాడు. ఎవరికైనా ప్రేమిస్తే చివరికి పెద్దలను ఒప్పించాలి కాబట్టి వావ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా అంటూ స్పష్టం చేశాడు యాంకర్ ప్రదీప్..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: