వెంకటేష్ వాడే ఒక్క విగ్గు ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కుటుంబ కథల సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో వైవిధ్య సినిమాలలో నటిస్తూ తనదైన ప్రతిభతో ఎన్నో విజయాలను అందుకున్నాడు వెంకటేష్. ఆయన నటించిన బొబ్బిలి రాజా, ధర్మచక్రం, గణేష్, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్నాడు.ఇక  ఇప్పుడు వెంకటేష్ కి సంబంధించిన ఒక వార్తా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. 

అయితే వెంకటేష్ ఎప్పుడూ టోపీ ధరించి కనిపించే ఈయనకు బట్టతల ఉందని చాలామంది భావిస్తున్నారు. ఇక ఇప్పుడు అది నిజమని తెలుస్తోంది.  ఆయన మేకప్ మెన్ రాఘవ ఈ విషయంపై ఆసక్తికర విషయాలను చెప్పడం జరిగింది. అయితే వెంకటేష్ కి  బట్టతల ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఆయన వయసు వల్ల వెంట్రుకలు ఊడిపోయాయని.. ఇక బట్టతల తెలియకుండా వెంకటేష్ ఖరీదైన విగ్గులు వాడతారని... గతంలో బొంబాయి నుంచి విగ్గులను తెప్పించుకున్నారని.. ప్రస్తుతం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నారని.. ఆయన చెప్పుకొచ్చాడు.

 అంతేకాదు సినిమా సినిమాకు వెంకటేష్ విగ్గులను మారుస్తూ ఉంటారట. ఇక ఆయన వాడే ఒక్కో విగ్గు 60 నుంచి 70 వేల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇక అది కూడా సినిమా స్థాయిని బట్టి ఉంటుందట. అయితే ఒక్కోసారి సినిమా ఆరు ఏడు నెలలు ఉంటుంది కాబట్టి రెండు మూడు విగ్గులు వాడే అవకాశం కూడా ఉంటుందట. అందుకే చాలామందికి ఆయన విగ్గు వాడతారు అనే విషయం తెలియదు. అయితే వెంకటేష్ కి విగ్గు వాడడం అస్సలు నచ్చదట. కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు బాగుండదు అని విగ్గు పెట్టుకుంటూ ఉంటారట. ఇక ఆయన కుటుంబంలో ఆయన తండ్రి జీన్స్ వల్లే వెంకటేష్ కి కూడా బట్టతల వచ్చిందని అంటున్నారు. దీంతో వెంకటేష్ విగ్గుకు ఖర్చు పెట్టే ధర ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: