"టాప్ గేర్" మూవీ ట్రైలర్ ను విడుదల చేయబోతున్న ఆ టాలీవుడ్ స్టార్ హీరో..!

Pulgam Srinivas
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస మూవీ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న యంగ్ హీరో లలో ఆది సాయి కుమార్ ఒకరు. ఆది సాయి కుమార్ ఇప్పటికే ఈ సంవత్సరం అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సంవత్సరం ఇప్పటికే అనేక మూవీ లతో ప్రేక్షకులను పలకరించినప్పటికీ ఆది సాయి కుమార్ కు ఏ మూవీ కూడా ఈ సంవత్సరం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేదు. అయినప్పటికీ ఆది సాయి కుమార్ హిట్ , ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస సినిమా లతో ప్రేక్షకుల ముందుకు వస్తూనే ఉన్నాడు. అందులో భాగంగా ఆది సాయి కుమార్ తాజాగా టాప్ గేర్ అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 30 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.
 

ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ యూనిట్ ఏ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా టాప్ గేర్ మూవీ యూనిట్ ఈ సినిమా ట్రైలర్ కు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది. డిసెంబర్ 18 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అలాగే ఈ మూవీ యూనిట్ టాప్ గేర్ మూవీ ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వేరు అవుతుంది. మరి ఈ మూవీ యొక్క ట్రైలర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: