అక్కడ నెంబర్ 1 గా నిలిచిన "ఆర్ఆర్ఆర్" మూవీ..?

Pulgam Srinivas
దర్శకదీరుడు రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే పాన్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో టాలీవుడ్ స్టార్ హీరో లు అయినటుbవంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించగా ,  యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటించింది. అజయ్ దేవ్ గన్ ,  శ్రేయ , సముద్ర ఖని ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. భారీ అంచనాలు నడుమ ఈ మూవీ ఈ సంవత్సరం మార్చి 25 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కొల్లగొట్టి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇలా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ మూవీ ని కొన్ని రోజుల క్రితమే జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేశారు. ఈ మూవీ కి జపాన్ లో కూడా ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. దానితో ఈ మూవీ కి జపాన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ జపాన్ లో సూపర్ రికార్డ్ ను సాధించినట్లు తెలుస్తోంది. చాలా సంవత్సరాల నుండి జపాన్ లో సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా నటించిన ముత్తు సినిమా చా నెంబర్ వన్ గ్రాఫర్ గా ఉంది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ మూవీ ముత్తు మూవీ ని వేనక్కు నెట్టి నెంబర్ వన్ స్థానంలో నిలిచినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: