పవన్ కళ్యాణ్ మూవీ స్టోరీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఆ స్టార్ డైరెక్టర్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి హరీష్ శంకర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు ఇప్పటికే అనేక మూవీ లకు దర్శకత్వం వహించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తెరకెక్కించిన గబ్బర్ సింగ్ మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా మారిపోయాడు. ఇది ఇలా ఉంటే హరీష్ శంకర్ ఆఖరుగా గద్దల కొండ గణేష్ అనే పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది.

ఆ తర్వాత హరీష్ శంకర్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ లో భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి చాలా రోజులే అవుతున్న ఇప్పటి వరకు ఈ మూవీ స్టార్ట్ కాలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ , movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ రేపు అనగా డిసెంబర్ 11 వ తేదీన పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా లవ్ యూ రామ్ టీజర్ విడుదలలో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ ... సంతోషం ,  మిస్టర్ పర్ ఫెక్ట్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ లకు దర్శకత్వం వహించిన దశరథ్ ,  పవన్ కళ్యాణ్ తో చేయబోయే సినిమా స్క్రిప్ట్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే దశరథ్ కూడా సంతోషం , మిస్టర్ పర్ ఫెక్ట్ మూవీ విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: