ఆస్తులు పంపకంపై షాకింగ్ కామెంట్స్ చేసిన సురేష్ బాబు..!?

Anilkumar
నందమూరి నటసింహం బాలకృష్ణ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరో గానే కాకుండా ఆహాలో   ప్రసారమయ్యే అన్ స్టాపబుల్ షో కి హోస్ట్గా వ్యవహరిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. నందమూరి నరసింహ బాలకృష్ణ పోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో ఎలాంటి ఆటంకాలు లేకుండా దూసుకుపోతోంది.. ఇక ఇప్పటికే ఈ షో కి సంబంధించిన నాలుగు ఎపిసోడ్లు పూర్తి చేసుకోగా ఐదవ ఎపిసోడ్ కి మంచి టిఆర్పి రేటింగ్ రావడం జరిగింది.. అయితే ఈ షో కి సినిమా సెలబ్రిటీలే కాకుండా రాజకీయ నాయకులు కూడా వచ్చి సందడి చేయడం మనం చూసాం..

 ఇదిలా ఉంటే ఇక తాజాగా ఈ షో కి అగ్ర నిర్మాతలైన సురేష్ బాబు మరియు అల్లు అరవింద్ తో పాటు అగ్ర దర్శకులు రాఘవేంద్రరావు మరియు కోదండరామిరెడ్డి రావడం ఈ షో కి సంబంధించిన ప్రోమోలో రిలీజ్ చేయడం జరిగింది.. అయితే తాజాగా ఈ ప్రోమో ని విడుదల చేయగా మంచి రెస్పాన్స్ ను అందుకుంటుంది.. అంతేకాదు ఎప్పుడు వస్తుందో అంటూ అభిమానులు తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు... ప్రజల ఈ శుక్రవారం రాత్రి ఈ ఎపిసోడ్ ను ఆ హార్టింగ్ రిలీజ్ చేయడం జరిగింది ఇక ఈ షోలో భాగంగా అనేక సినిమాల గురించి మరియు ఆ సినిమాలో నటించే హీరోల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది..ఇక ఈ క్రమంలోనే రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ..

మీ ప్రొడక్షన్లో సినిమా చేస్తే.. వెంకటేష్ కి రెమ్యునరేషన్ ఇస్తారా అని అడిగారు బాలయ్య బాబు.. ఈ విషయంపై సురేష్ బాబు స్పందిస్తూ… మా ప్రొడక్షన్లో వెంకటేష్ సినిమా చేస్తే సగం పారితోషకం మాత్రమే ఇస్తాను.. మిగతాది సురేష్ ప్రొడక్షన్ లోకి రాసుకుంటాను.. వెంకటేష్ కూడా ఏమనడు..అడగడు.. అని తెలిపారు సురేష్ బాబు... అంతేకాకుండా దాని అనంతరం ఆస్తి విషయాల్లో గురించి కూడా బాలకృష్ణ సురేష్ బాబును ప్రశ్నించడం జరిగింది అయితే..మొదటిసారి ఆయన ఆస్తి పంపకంపై స్పందించడం జరిగింది.ఇక  సురేష్ బాబు మాట్లాడుతూ.. ఆస్తిని మేము విడగొట్టలేదు .. కానీ ఫుడ్ మాత్రం నేను , వెంకటేష్ సరిగ్గా సగం సగం తీసుకొని తింటాము. లేకపోతే గొడవలు అయిపోతాయి..అంతేకాదు  భవిష్యత్తులో ఆస్తి పంపకం వస్తే చిల్లిగవ్వ కూడా నేను నా దగ్గర పెట్టుకోను.. నా తమ్ముడికి సరి సమానం పంచుతాను అంటూ అన్నయ్యగా తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడు సురేష్ బాబు.. ఇక ఈ వార్త కాస్త ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: