ఆ స్టార్ హీరోకు ఘాటు లిప్ లాక్ పెట్టిన అను ఇమ్మాన్యుయేల్..!?

Anilkumar
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మజ్ను సినిమాతో తెలుగు అడుగుపెట్టిన అను ఇమ్మాన్యుయేల్ గురించి మనకి తెలిసిందే. ఇక  ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న అనును చూసి తను ఖచ్చితంగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ అవుతుందని అంతా అనుకున్నారు.అంతేకాదు తనకు మామూలుగా పాపులారిటీ రాదనుకున్నారు. తనను చూసి అందరూ గోల్డెన్ లెగ్ అన్నారు. కానీ.. కేవలం మజ్ను సినిమాతో మాత్రమే తను హిట్ కొట్టింది. ఇక ఆ తర్వాత చాలా సినిమాల్లో తనకు అవకాశం వచ్చినా అవేవీ తనకు అంతగా పేరు తీసుకురాలేదు.

అయితే స్టార్ హీరోలతో నటించినా కూడా ఆ అమ్మడుకు ఎందుకో అదృష్టం కలిసి రాలేదు. నాగ చైతన్య, మారుతి కాంబోలో వచ్చిన శైలజ గారి అల్లుడు సినిమా కూడా ఆడలేదు. ఇక ఆ తర్వాత కూడా అను చాలా సినిమాల్లో నటించింది కానీ.. అవేవీ హిట్ టాక్ తెచ్చుకోలేదు.అయితే  ఆ తర్వాత తనకు ఏమైందో తెలియదు.. తనకు అవకాశాలు తగ్గాయో.. తనే సినిమాలకు దూరం అవుతుందని అనుకుందో ఏమో కానీ.. కొన్నేళ్ల పాటు తను ఇండస్ట్రీకి దూరం అయింది. ఇక తర్వాత సన్నగా, బొద్దుగా తయారైన అను.. ఇటీవల ఊర్వశివో రాక్షసివో అనే సినిమాలో నటించింది.

కాగా అందులో యువ హీరో శిరీష్ హీరోగా నటించింది.ఇకపోతే ఈ సినిమాలో అను హద్దులు దాటిన విషయం తెలిసిందే.ఇక  తన రొమాన్స్ కోసమే సినిమాకు వెళ్లిన వాళ్లూ ఉన్నారు.అయితే  బట్టలు విప్పేసి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది అను.ఇక  అందులో శిరీష్ తో లిప్ లాక్ కూడా చేసింది అను.అయితే తన లిప్ లాక్ సీన్ బాగా రావడంతో పాటు తన రొమాంటిక్ సీన్స్ అన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక  దీంతో అను ఇమ్మాన్యుయేల్ కు కాస్తో కూస్తో ఫేమ్ వచ్చిందట.కాగా  అందుకే మరో యంగ్ హీరో కూడా తనపై కన్నేశాడని వార్తలు వస్తున్నాయి.ఇక  ఆయన ఎవరో కాదు. మరో మెగా హీరో సాయిధరమ్ తేజ్. అయితే తన సినిమాలో అను ఇమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక మొత్తానికి అను ఇమ్మాన్యుయేల్ ఈసారి అయినా జాక్ పాట్ కొట్టినట్టేనా వేచి చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: